తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు నిర్మాతలుగా పలు సంస్థలు స్థాపించి, పలువురు నటీనటులతో సినిమాలు నిర్మించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వారు చాలా మందే వున్నారు. కాగా అటువంటి వారిలో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కూడా ఎంతో ముఖ్యులు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకి విచ్చేసిన అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మొదలుకొని మొన్నటి రామ్ వరకు అనేకమంది దిగ్గజ నటీనటులతో సినిమాలు నిర్మించిన గొప్ప ఘనత రామానాయుడిది.

అది మాత్రమే కాక తెలుగు తో పాటు హిందీ, తమిళ్ వంటి అనేక భాషల్లో సినిమాలు తీసి వాటితో గొప్ప విజయాలు సొంతం చేసుకున్న రామానాయుడు, ఆ తరువాత నిర్మాతగానే కాక, అటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం ఎంపీగా 1999లో పోటీ చేసి మంచి మెజారిటీ తో విజయఢంకా మ్రోగించిన రామానాయుడు 2004 వరకు ఎంపీగా అక్కడి ప్రజలకు విశేషమైన సేవలందించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక అప్పట్లో ప్రజలకు తనవంతుగా విశేష సేవలందించిన రామానాయుడు ఇకపై రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అనంతరం పూర్తిగా సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యారు.

అయితే ఎంపీగా ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో తన సొంత నిధులను సైతం ఖర్చు చేసి బాపట్ల అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారని ఇప్పటికీ అక్కడి స్థానిక ప్రజలు తమ తండ్రి రామానాయుడు గురించి చెప్తుండడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ఆయన గొప్పతనాన్ని గురించి పలు సందర్భాల్లో తనయులు వెంకటేష్, సురేష్ చెప్తూ ఉండేవారు. ఇక ఆ విధంగా అటు నిర్మాతగా, ఇటు రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. ఆయన 2015లో మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: