నాగచైతన్య తో విడిపోయిన తరువాత కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఆ షాక్ నుండి తేరుకుని తిరిగి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి తన స్నేహితులతో కలిసి డెహ్రాడూన్ వెళ్ళింది. అక్కడ అందమైన ప్రకృతిని ఆశ్వాదిస్తూ అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తిరిగి తన అభిమానులతో ఉత్సాహంగా టచ్ లోకి వచ్చింది సమంత. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అల్లు అర్జున్ కూతురు అర్హ పై సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.


బన్నీ కూతురు కళ్ళల్లో ఒక స్పార్క్ ఉందని పుట్టుకతోనే అర్హ రాక్ స్టార్ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు కెమెరా ముందు ఎలాంటి భయము లేకుండా అర్హ నటించిన తీరు చూసినప్పుడు భవిష్యత్ లో అర్హ టాప్ హీరోయిన్ గా మారడం ఖాయం అని అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసింది. అర్హ తాను నటిస్తున్న ‘శాకుంతలం’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం తనకు చాల ఆనందంగా ఉందని ఆ మూవీ విడుదల తరువాత ఆమె గురించి జనం తెగ మాట్లాడుకుంటారు అంటూ జోశ్యం చెపుతోంది.


అర్హ ‘శాకుంతలం’ షూటింగ్ కోసం వారం రోజులు తన వద్ద ఉందని చెపుతూ షూటింగ్ చివరి రోజున దర్శకుడు గుణశేఖర్ అర్హ కోసం సెట్ ను బెలూన్స్ తో డెకరేట్ చేసి కేక్ కోయించిన తరువాత అర్హ ను ఇంటికి పంపుతున్నప్పుడు తాను ఇంటికి వెళ్ళాను అంటూ గగ్గోలు పెట్టిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంది. అంత చిన్న వయసులో నటనపట్ల ఆమెకు ఉన్న ఆశక్తి తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ కామెంట్స్ చేసింది.


అర్హ విషయంలో అల్లు అర్జున్ అభిప్రాయాలు వేరేగా ఉన్నాయని తనను ఒక పెద్ద సైంటిస్ట్ గా చూడాలని బన్నీ కోరుకుంటున్నాడని అయితే పెద్ద అయ్యాక అర్హ బన్నీ మాట వింటుందా అంటూ జోక్ చేసింది. ఇక ‘శాకుంతలం’ మూవీ గురించి మాట్లాడుతూ ఈమూవీ చిత్రీకరణ పూర్తి అయిందని ఈమూవీని సరైన టైమ్ లో రిలీజ్ చేయడానికి గుణశేఖర్ రిలీజ్ డేట్ ను అన్వేషిస్తున్నాడు అంటూ ఆసక్తికర విషయాన్ని సమంత లీక్ చేసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: