పవన్ కు తాను వీరాభిమానిని అని దిల్ రాజ్ అనేక సందర్భాలలో అంటూ ఉంటాడు. ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ విడుదల రోజున దిల్ రాజ్ పవన్ అభిమానులతో ఈమూవీని చూస్తూ పవన్ స్క్రీన్ మీద కనిపించగానే పవన్ అభిమానులతో కలిసి రెచ్చిపోయి కాగితాలు పువ్వులు విసిరిన సందర్భాన్ని గమనించిన వారికి పవన్ పై దిల్ రాజ్ కు అంత అభిమానం ఉందా అని అనిపించడం సహజం.


అయితే అలాంటి దిల్ రాజ్ పై పవన్ వీరాభిమానులు అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం దిల్ రాజ్ ‘రౌడీ బాయ్స్’ మూవీ సాంగ్ లాంచ్ ఫంక్షన్ లో దిల్ రాజ్ చేసిన కామెంట్స్. ఈమూవీ ఫంక్షన్స్ కు విజయ్ దేవర కొండ అతిధిగా వచ్చాడు. చాల కాలం తరువాత విజయ్ తన అభిమానులను చూడటంతో రెచ్చిపోయిన ఉత్సాహంతో మాట్లాడాడు.


దీనితో ఆ మూవీ ఫంక్షన్ కు వచ్చిన అభిమానులు అంతా విజయ్ దేవరకొండ నామస్మరణ చేసారు. ఆ సీన్ ను చూసిన దిల్ రాజ్ మరింత రెచ్సిపోయి తనకు విజయ్ దేవరకొండను చూసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ కెరియర్ కు సంబంధించి తొలి రోజులలో నటించిన ‘తొలిప్రేమ’ ‘బద్రీ’ సినిమాలలో పవన్ నటించినప్పుడు పవన్ కు ఏర్పడిన మ్యానియా గుర్తుకు వస్తుందని అంటూ పవన్ కు ఉన్న మ్యానియా ను విజయ్ కొండ కు ఉన్న మ్యానియాతో పోల్చి కామెంట్స్ చేసాడు.


ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో ఇప్పుడు వారంతా ఆ కామెంట్స్ పై అసహనాన్ని వ్యక్త పరుస్తున్నారు. పవన్ కు ఉన్నది అభిమానులు కారు భక్తులు అని చెపుతూ అలాంటి భక్తులు విజయ్ దేవరకొండకు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సరదాగా దిల్ రాజ్ చేసిన ఒక చిన్న పోలిక పవన్ అభిమానులకు అసహనాన్ని కల్గించిన విషయాన్ని చూస్తే పవర్ స్టార్ అభిమానులు ప్రతి చిన్న విషయాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తారో అర్థం అవుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: