మంచి పాట ఎక్క‌డున్నా గుర్తించాలి గౌర‌వించాలి. ప్ర‌భాస్ ఆ ప‌ని ఎన్న‌డూ చేస్తూనే ఉంటాడు. త‌న సినిమాల్లో మంచి పాట‌లు ఎన్నో ! వ‌చ్చాయి.  ప్ర‌భాస్ న‌ట‌న‌తో వాటికో వైభ‌వం వ‌చ్చింది కూడా! మంచి పాట సినిమా క‌థ‌ను మారుస్తుంది. కానీ ఆ పాటే ఆ సినిమాకు క‌థ‌కు ప్రేర‌ణ అయింది. ఆ పాటేంటి ఆ క‌థేంటి.. జ‌గ‌మంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది..


ఇప్ప‌టిదాకా ప్ర‌భాస్ న‌టించిన సినిమాల్లో పాట‌ల‌న్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటి వెనుక మంచి సాహిత్య కారుల కృషి ఉంది. మంచి పాట వ‌స్తే ఆయ‌న ఎంతో సంతోషిస్తారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో మంచి పాట‌ల‌కు చోటేంట‌ని ఎవ్వ‌రైనా సందేహం వ్య‌క్తం చేయ‌వ‌చ్చు కానీ ప్ర‌భాస్ సినిమాల్లో చాలా పాటలు  మంచి గుర్తింపును గౌర‌వాన్నీ ఆద‌రాన్నీ అందుకున్నాయి. ఈ క్ర‌మంలో చ‌క్రం సినిమాలో జ‌గ‌మంత కుటుంబం నాది పాట ఆయ‌న‌కు చాలా ఇష్టం. వాస్త‌వానికి ఈ పాట సినిమా కోసం రైట‌ర్ సిరివెన్నెల సీతారామ‌శా స్త్రి రాయ‌కున్నా, ఓ సంద‌ర్భంలో డైరెక్ట‌ర్ కృష్ణవంశీ ఈ పాట విని ఈ పాట ఆధారంగానే సినిమా తీయాల‌ని నిశ్చయించుకుని, చ‌క్రం సినిమాను రూపొందించారు. ఈ పాటను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చక్ర‌వ‌ర్తి కుమారుడు శ్రీ ఆల‌పించారు. ఆయ‌నే స్వ‌ర‌ప‌రిచారు కూడా!

ఈ పాట ఇండ‌స్ట్రీలో ఎంతో మందికి ఫేవ‌రెట్ గా మారిపోయింది. జ‌గ‌మంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.. సంసార సాగ‌రం నా ది.. స‌న్యాసం శూన్యం నాదే అని ఎంత గొప్పగా చెప్పారో ఈ పాట‌లో! గాలి ప‌ల్ల‌కిలో త‌ర‌లే ఆ పాట ఎంద‌రినో క‌దిలించింది. ఎందరికో సుప్ర‌భాత గీతం అయింది.  సీతారామ‌శాస్త్రి సాహిత్యం ద్వారా ద‌క్కిన కీర్తి కిరీటానికి క‌లికితురాయిగా నిలిచింది. మ‌నిషి జీవిత సారాన్ని పాట‌లో వినిపించిన తాత్వాక ర‌చ‌న ఇది. ఈ పాట విన్నాక ప్ర‌భాస్ ఎంతో ఆనందించాడు. ఈ పాట ఎప్పుడు ఎవ్వ‌రు వినిపించినా అంతా భావోద్వేగం చెందుతారు. ఒక పాట జీవితాన్ని మ‌లుపు తిప్పింది అని చెప్ప‌డంలో ఎంతో అర్థం ఉంది. అవును! ఒక్క పాట  సినిమా రూప‌క‌ల్ప‌న‌కే కాదు ప్ర‌భాస్ లాంటి హీరోల‌కు మంచి గుర్తింపునూ ఇచ్చింది. అవును! ఈ సంసార సాగ‌రంలో మ‌నిషి ఎన్న‌డూ ఒంట‌రే! అలాంటి ఏకాంతాన్ని ప్రేమిస్తూ సాధించాల్సిన‌వి ఎన్నో! సాధించాక వాటిని మ‌రొక్క‌సారి త‌లుచుకుంటే పొందే ఆనందాలూ అన్నే!


మరింత సమాచారం తెలుసుకోండి: