ఈ ఏడాది సత్యజిత్ రే అవార్డు ఎవరికో తెలుసా ?

ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు సత్యజిత్ రే.ఆయన స్మారకార్థం ప్రతి ఏటా కేంద్ర సమాచార, ప్రాసార శాఖ సినీరంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి సత్యజిత్ రే అవార్డును అందజేస్తుంది. భారత్ లోనే కాకుండా విదేశీ సినీరంగ ప్రముఖులు ఈ అవార్డు అందు కోవాలని తహతహ లాడుతుంటారు. ఆయన లాగా చిత్రాలు నిర్మించాలని ఉబలాటపడుతుంటారు. ఈ ఏడాది ఇద్దరు సినీరంగ ప్రముఖులు ఈ అవార్డును అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. అనురాగ్ ఠాకూర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి. ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ  సినీ దర్శకుడు  మార్టిన్ స్కోర్సెస్, హంగేరియాకు చెందిన ఇస్టావెన్ స్జాబోలకు ఈ అవార్డులు బహూకరించనున్నారు.వీరిద్దరూ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్కోర్సెస్ అనేక అవార్డు సినిమాలు తీశారు. ట్యాక్సీ డ్రైవర్, గుడ్ ఫెల్లాస్ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఇక పోతే  హంగేరియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇస్టావెన్ జాబో తీసిన చిత్రాలు చాలా విలక్షణమైనవి.  మెఫిస్టో వంటి అకాడమీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గోవాలో ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ  జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ అవార్డులు అందజేయనున్నారు,
భారత్ లోని బెంగాల్ కు చెందిన సత్యజిత్ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన అవసరం లేదు.  విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ శాంతినికేతన్ లో విద్యాభ్యాసం చేశారు. ఇరవయ్యో శతాబ్దపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరుగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జీంచారు. సాంకేతికత అంతగా అందుబాటులోకి రాని రోజుల్లో ముప్పైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన  పథేర్ పాంచాలీ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయ బహుమతులు అందుకుంది. అంతే కాదు 1992 లో ఆయన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును కూడా అందుకున్ననారు.


మరింత సమాచారం తెలుసుకోండి: