హీరో ప్రభాస్ బర్తడే అంటే తన అభిమానులు ఎంత కోలాహలం చేస్తున్నారో మనకు తెలిసిన విషయమే.ఇక ప్రభాస్ పుట్టినరోజు మూడు నెలల ముందు నుంచే ఈ హీరో హవా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రోజున ప్రభాస్ పుట్టినరోజు కావున.. ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచే భారీ అప్డేట్లు విడుదల కాబోతున్నాయి. అందులో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే టీజర్ విడుదల అవ్వడం జరిగింది వాటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.


ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతగానో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.ఇక ఈ సినిమా అప్డేట్ రాకపోయేసరికి.. ప్రభాస్ అభిమానులు వీరిపై ఎన్నో రకరకాలుగా కామెంట్లు చేసి తిట్టిపోశారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాదే శ్యామ్ టీజర్ రానేవచ్చింది.దీంతో అభిమానుల ఆకలి తీర్చాడు డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్.

దీంతో ఈ టీజర్ చూసిన అభిమానులు ఎంతగానో సంబరపడిపోతున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ప్రభాస్ ఈ సినిమాలో  ఒక క్లాసిక్ లుక్  లో  నటిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇందులో ప్రభాస్ చెప్పే డైలాగులు చాలా సింపుల్ గా ఉన్నవి. ముఖ్యంగా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో  ప్రభాస్ పేరు విక్రమ్ ఆదిత్య అని తనే స్వయంగా తెలియజేశాడు. అంతేకాకుండా టీజర్ చివరిలో చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో దిగనున్నట్లుగా టీజర్ లో చూపించడం జరిగింది.ఈ మూవీలో ప్రభాస్ సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది.

మూవీ ఎలా ఉంటుందో అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ నే ఉపయోగించినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: