పూరీ జగన్నాధ్. టాలీవుడ్ లో పాతికేళ్ళ హిస్టరీ. ఆయన ఫిలాసఫీ వేరు, ఆయన సినిమా టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన్ని దాసరి నారాయణరావుతో కొన్ని విషయాల్లో పోల్చవచ్చు. ఆయన సినిమాను చాలా స్పీడ్ గా తీస్తారు.

అలాగే టైటిల్ ని ముందు అనుకుని మూవీ చేయగల సత్తా ఉన్న కొద్ది మంది డైరెక్టర్లలో పూరీ ఒకరు. ఇక పూరీ ఏ హీరోతో సినిమా తీసినా వారితో బాగా కనెక్ట్ అవుతారు. ఆ మధ్య బాలయ్యతో పైసా వసూల్ మూవీ తీసి ఆయనతో బాగా ఇంటరాక్షన్ పెంచుకున్నారు. తిరిగి ఈ ఇద్దరూ మూవీ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే డార్లింగ్ ప్రభాస్ తో పూరీ అటాచ్ మెంట్ వేరుగా ఉంటుంది. పూరీ బుజ్జిగాడు మూవీతో పాటు ఏక్ నిరంజన్ మూవీని ప్రభాస్ తో తీశారు. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఇద్దరి మధ్యన బాండేజ్ అయితే చాలా స్ట్రాంగ్ గా మారిందట.

ఇక పూరీ కొడుకు ఆకాశ్ తో తీస్తున్న రొమాంటిక్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్ వర్క్ ని పూరీ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసిన ప్రభాస్ డార్లింగ్ నేను రొమాంటిక్ మూవీకి ప్రమోషన్ చేస్తాను అని ముందుకు వచ్చాడుట. ఈ విషయాన్ని పూరీ చెబుతూ డార్లింగ్ అంటే ప్రభాసే అని మరోమారు ఎత్తేశారు. ఇక ప్రభాస్ తనను ఫస్ట్ టైమ్ డార్లింగ్ అని పిలిస్తే అది తన ఒక్కడికే అనుకున్నా కానీ ఆయన అందరినీ అలాగే పిలుస్తూ ఈ రోజు కోట్లాది మందికి డార్లింగ్ అయిపోయాడని చెప్పుకొచ్చారు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ప్రభాస్ లో ఎక్కడా ఇగో లేదు, ఆయన మంచితనం కూడా ఏ మాత్రం తగ్గలేదు దటీజ్ ప్రభాస్ అనాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: