పూరిజ‌గ‌న్నాథ్ త‌న‌యుడు యంగ్‌హీరో ఆకాశ్‌పూరి, అందాల హీరోయిన్ కేతిక శ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తొన్న "రొమాంటిక్" చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. పూరిక‌నెక్ట్స్, పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యాన‌ర్ల‌పై ఛార్మీ, పూరిజ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు రొమాంటిక్ సినిమాకు. ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా 'రొమాంటిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించారు.

దీనికి ముఖ్యతితిగా లైగ‌ర్ హీరో విజయ్ దేవ‌రకొండ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడారు... నేను వరంగ‌ల్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇక్క‌డి అభిమానులు నాపై ప్రేమ చూపిస్తారు. నాకు థ్యాంక్యూ ఎలా చెప్పాలో కూడ తెలియ‌ద‌న్నారు. అదేవిధంగా నేను మ‌ళ్లీ లైగ‌ర్ కోసం ఎలాగో వ‌రంగ‌ల్‌కు వ‌స్తాను. పూరి స‌హా అంద‌రూ నాకు ప్రామీస్ చేశారు. మీఅంద‌రికీ థ్యాంక్యూ చెప్ప‌గ‌లిగే ఒకే విధానం మ‌ళ్లీ నా ఫంక్షన్‌కు ఇక్క‌డ‌కు రావ‌డ‌మే. ఇక్క‌డికి వ‌స్తే నా లైగ‌ర్ సెట్‌కు వ‌చ్చిన‌ట్టు ఉంద‌ని తెలిపారు. వీళ్లంతా మా లైగ‌ర్ టీమ్‌. వీరంద‌రూ ఆరోగ్యంగా, ఆయురోగ్యాల‌తో, సంతోషంగా ఉండాలి. అప్పుడే లైగ‌ర్ ప‌నులు చాలా వేగంగా జ‌రుగుతాయి. నేను మ‌న‌స్పూర్తిగా  రొమాంటిక్‌, లైగ‌ర్ సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపాడు.

అదేవిధంగా సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ క‌శ్య‌ప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరోయిన్‌గా కేతిక న‌ట‌న చాలా బాగుంద‌ని ప్ర‌శంసించారు. ఆమె సూప‌ర్ ఇంట‌లిజెంట్ అని కొనియాడారు. ఆమెకు మంచి ప్యూచ‌ర్ ఉంద‌ని చెప్పాడు విజ‌య్‌. ఇక హీరో ఆకాశ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నిలో ఓ ఫైర్ ఉంది. దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. మీ నాన్న అది చూసి కాల‌ర్ ఎత్తాలి అని పేర్కొన్నాడు. ఆకాశ్‌కు సినిమా పిచ్చి చాలా ఎక్కువ అంట‌.. సినిమా బాలేక‌పోయినా చూసి పాజిటివ్‌గానే ఉంద‌ని చెబుతార‌ట‌. అలాంటి వారు ఉంటే సినిమా ఇండ‌స్ట్రీ బాగుంటుంద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రంతో ఆకాశ్ స‌క్కెస్ కొడ‌తాడ‌ని ఆశిస్తున్న‌ట్టు వివ‌రించాడు. ఈ చిత్రం నిర్మాత‌, రైట‌ర్లు చార్మి,  పూరి అంటే నాకు ఎంతో ఇష్టం అని వెల్ల‌డించాడు. అంద‌రికీ లైగ‌ర్ సినిమా గురించి ఓ క్లారిటీ ఇద్దామ‌నుకుంటున్న‌. డెస్టిని పూరిని మా లైఫ్‌లోకి తీసుకొచ్చింది. వీళ్లు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. లైగ‌ర్ సినిమాలో ఒక్క విజువ‌ల్ చూస్తే అది మీకే అర్థ‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించాడు. మేము ఒక్క‌టే ఫిక్స్ అయ్యాం. 2022లో లైగ‌ర్ ఇండియాని షేక్ చేయాల‌ని. అది మీరు కూడ ఫిక్స్ అయిపోండి. అక్టోబ‌ర్ 29న రొమాంటిక్ విడుద‌లవుతున్న రొమాంటిక్‌, 2022లో వ‌స్తున్న లైగ‌ర్ చిత్రాల‌కు మంచి విజ‌యాన్ని అందిస్తార‌ని కోరుతున్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: