టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరి కంటే ఎక్కువగా పారితోషకాన్ని అందుకుంటూ అందరి కంటే ఎక్కువ భారీ బడ్జెట్ సినిమా లు చేస్తున్న హీరో ప్రభాస్ అని చెప్పాలి. ఆయన బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న ప్రతి సినిమా కూడా భారీ భారీ చిత్రాలే కావడం విశేషం. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ విభిన్నమైన కథాంశంతో  చిత్రలని కూడా ఎంపిక చేసుకుంటూ ప్రభాస్ తన స్పెషాలిటీ చాటి చెబుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో తారాస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పవచ్చు.

ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ముందుకు పోతూ ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు ఏ విధమైన పాత్ర లో నటించబోతున్నా డు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఎంపిక చూస్తుంటే ప్రభాస్ మరికొన్ని రోజుల్లో పాన్ వరల్డ్ హీరోగా ఎదుగుతాడని అందరూ చెబుతున్నారు. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ పాత్ర కాస్త వెరైటీగా ఉండబోతుందని తెలుస్తుంది. 

ఈ సినిమాకు సంబంధించిన హీరో పాత్ర గురించి చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్ సినిమాకి కొత్త సూపర్ హీరో అంటూ ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్ష లు తెలిపిన ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రభాస్ పాత్రను సూపర్ హీరో గా పోల్చింది. ఆ పాత్రలో ప్రభాస్ నటన చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో గా కనిపిస్తున్నాడని అందుకే ఆ విధంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపిన అని చెబుతున్నారు మరి సూపర్ హీరోగా తొలిసారి వెండితెరపై కనిపించబోతున్న ప్రభాస్ ఏ రేంజ్ లో ఆ చిత్రం తో ప్రేక్షకులను నేర్పిస్తాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: