గతంలో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హోస్టింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంలో కూడా పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇటీవలే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమం మొదటి సీజన్ షూటింగ్ పూర్తి చేసుకుంది అనే విషయం తెలిసిందే. మరో సీజన్ కి హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఈ షో నిర్వాహకులు రెండవ సీజన్ కి కూడా ఎన్టీఆర్ ను హోస్ట్‌గా తీసుకురావాలని భావించారట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను సంప్రదిస్తే ఎన్టీఆర్ నో చెప్పినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. అయితే రెండవ సీజన్ కోసం ఎన్టీఆర్ కు భారీగా రెమ్యూనరేషన్ ముట్ట చెప్పేందుకు దర్శకనిర్మాతలు సిద్ధం అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం నో చెప్పారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తిచేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలతో బిజీ అవ్వబోతున్నాడు. ఈ క్రమంలోనే భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఎవరు మీలో కోటీశ్వరుడు నెక్స్ట్ సీజన్ కి ఎవరు హోస్ట్‌గా రాబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.