గతేడాది మా డైరీ లాంచ్‌లో చిరంజీవి, మోహన్ బాబు కెమిస్ట్రీ చూసి ఇద్దరి మధ్య గొడవలు సమసిపోయాయని ఇండస్ట్రీ అంతా అనుకుంది. కానీ ఈ ఏడాది జరిగిన మా ఎలక్షన్స్‌తో మళ్లీ వీళ్ల మధ్య గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం మొదలైంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు మాటలు విన్న తర్వాత ఈ సీనియర్ల మధ్య చాలా గ్యాప్‌ ఉందనే టాక్ స్టార్ట్ అయ్యింది. చిరంజీవి, మోహన్‌ బాబు మధ్య చాలా రోజుల క్రితమే డిస్ట్రబెన్సెస్‌ వచ్చాయని చెబుతుంటారు. వజ్రోత్సవాల సమయంలో సెలబ్రెటీ అంటే ఏంటి.. లెజెండ్‌ అంటే ఏంటి అని మోహన్‌ బాబు ప్రశ్నించడం.. పవన్‌ కళ్యాణ్ తమ్ముడు మోహన్‌ బాబు అని సంభోదించడంతో వీళ్ల గొడవ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది.

ఈ ఏడాది జరిగిన మా ఎన్నికల్లో మోహన్‌ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేశాడు. మరోవైపు ప్రకాశ్‌ రాజ్‌ బరిలో నిలిచాడు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కి నాగాబాబు మద్దతిచ్చాడు. అన్నయ్య చిరంజీవి కూడా సపోర్ట్‌ చేస్తున్నాడని చెప్పాడు నాగబాబు. 'రిపబ్లిక్' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్ స్పీచ్‌ తర్వాత మా ఎన్నికల ప్రచారం మరోవైపు మళ్లింది. ప్రకాశ్‌ రాజ్ ఎవరివైపు ఉంటున్నాడు.. పవన్‌ కళ్యాణ్‌ వైపా ఇండస్ట్రీ వైపా అని విష్ణు క్వశ్చన్ చేశాడు. దీంతో చిరు, మోహన్‌ బాబు మధ్య గొడవ ముదిరిందనే ప్రచారం జరిగింది. చిరంజీవి, మోహన్‌ బాబు మధ్య గొడవలకి అల్లు అరవింద్‌ ఫుల్‌స్టాప్ పెడుతున్నాడట. అలాగే మా ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇచ్చిన బాలక్రిష్ణకి, చిరుకి ఉన్న గ్యాప్‌ని కూడా తగ్గిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆహాలో బాలయ్యతో అన్‌స్టాపబుల్ అనే టాక్‌ షో తీస్తున్నాడు అల్లు అరవింద్. దీంతో జనాల్లోకి బాలకృష్ణ, మెగాకాంపౌండ్‌ మధ్య గొడవలు లేవనే మెసేజ్‌ వెళ్తుందని భావిస్తున్నారు సినీ జనాలు.

అల్లు అరవింద్‌ నెక్ట్స్‌ 'ఆహా'లో మోహన్‌ బాబుతో ఒక వెబ్‌ సీరీస్‌ తీస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇంట్రెస్టింగ్‌ సీరిస్‌ కోసం మోహన్‌ బాబుని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఒక వేళ మోహన్‌ బాబు ఆహా సీరీస్‌కి సైన్‌ చేస్తే, మెగా కాంపౌండ్‌తో మంచుకి ఎలాంటి గొడవలు లేవనే మెసేజ్‌ వెళ్తుంది. వీళ్ల అభిమానుల మధ్య గొడవలు కూడా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: