మెగా ప్రిన్స్ గా మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కు తన వర్గం ప్రేక్షకులు ఉండనే ఉన్నారు. ఈ హీరో సినిమా చేశాడు అంటే మినిమం గ్యారంటీ అన్న నమ్మకం నిర్మాతలకు కూడా వచ్చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వరుణ్ తేజ్ పెళ్లి విషయం కొంత కాలం క్రితం హాట్ టాపిక్ అయింది. కరోనా సమయంలో హీరోలంతా పెళ్లిపీటలు ఎక్కుతుండడంతో హీరో ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగుతాయి అంటూ వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగానే పెళ్లి బాజాలు మోగాయి కానీ అది ఆయన పెళ్లి కాదు. ఆయన చెల్లెలు నిహారిక పెళ్లి. నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకుంటాడని మరో వార్త వచ్చింది. నిహారిక తో పాటు వరుణ్ తేజ్ కి పెళ్లి చేయాలని నాగబాబు నిర్ణయించుకున్నారని, ఓ పెద్ద కుటుంబం తో సంబంధం కలుపుకోవడానికి మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ప్లాన్ చేశారని, ఈ మేరకు వారితో మాటలు కూడా అయిపోయాయని పుకార్లు వచ్చాయి ఈ వార్తలపై ఆయన తండ్రి మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ వరుణ్ తేజ్ కు మంచి అమ్మాయిని చూసి మీరే పెళ్లి చేసేయండి అంటూ వ్యంగ్యంగా స్పందించారు. దీంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ వయసు 32 ఏళ్లు. మరి ఈ హీరో త్వరలోనే ఒక ఇంటివాడు అవుతాడా? లేదంటే ప్రభాస్ లా సినిమాలపై దృష్టి పెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవుతాడా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా గని విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: