తెలుగు చిత్ర పరిశ్రమకి నేను శైలజా సినిమాతో పరిచయమైన నటి కీర్తి సురేష్. ఆమె మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేష్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కూతురు. ఆమె 2000 మొదట్లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత గీతాంజలి సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే కీర్తి సురేష్ నాలుగో తరగతి వరకు  తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు. ఆ తరువాత ఆమె చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో కొనసాగించారు. ఇక తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వెళ్లారు. ఆ తరువాత స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరినట్లు తెలిపారు. అయితే సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని ఒక్క సందర్భంలో చెప్పుకొచ్చారు.

కీర్తి సురేష్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సమయంలో విమర్శలు అందుకున్న ఆమె ఈ సినిమా తరువాత ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. మహానటి సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. కాగా.. సినిమాల విషయానికి వస్తే తెలుగులో పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. అయితే కీర్తి సురేష్ పెళ్లిపై గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. అనిరుధ్ రవిచంద్ర‌న్‌తో ప్రేమ‌లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించారు. ఆమెకు అసలు పెళ్లి ఆలోచనే లేదని, తన దృష్టి అంతా సినిమాల మీదే అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: