టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆతృతతో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అగ్ర హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్నారు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన సినిమాని ప్రపంచవ్యాప్తంగా...

 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ఇద్దరు హీరోల డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం ఎంత అనే విషయం జక్కన్న సన్నిహితుల దగ్గర నుంచి తెలిసింది. ఈ సినిమా అవుట్ పుట్ మొత్తం మూడు గంటలకుపైగా వచ్చిందట. అయితే రాజమౌళి అనవసరమైన సన్నీ వేశాలను కట్ చేసి.. ఫైనల్ గా సినిమా రన్ టైం ని రెండు గంటల 45 నిమిషాలకు కుదించినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్లే త్రిబుల్ ఆర్ అవుట్ పుట్ మొత్తం ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్రయూనిట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రమోషన్ లో భాగంగా దోస్తీ అనే పాటని కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రమోషన్స్ ని ఆపేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం అతి త్వరలోనే మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నారట. ఇక ఈ ప్రమోషన్స్ కోసం జక్కన్న సరికొత్త ప్లాన్స్ ని కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR