టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు మంచు మనోజ్. బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా తన సొంత టాలెంట్ తో హీరోగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే మంచు మనోజ్ సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాల విషయంలో మనోజ్ కాస్త స్లో అయ్యాడు. అయితే ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు ఈ మంచువారబ్బాయి. తాజాగా 'అహం బ్రహ్మాస్మి' అనే  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

ఈ విషయం పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో మంచు మనోజ్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్న మనోజ్.. కొన్నాళ్లకు మనస్పర్ధలు రావడంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టిసారించిన మనోజ్.. ఇటీవల మా ఎన్నికల్లో తన అన్న గెలుపుకోసం ఎంతో కష్టపడ్డాడు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు మనోజ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే, ఎక్కడ కూడా గొడవలు కాలేదని మా మెంబర్స్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తన భార్య ప్రణతి రెడ్డి కి విడాకులు ఇచ్చిన మంచు మనోజ్..

మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మనోజ్ ఓ ఫారిన్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. అయితే ఆమె ఇక్కడ అమ్మాయే అయినా.. ఫారిన్ లో సెటిల్ అయిందట. ఇక మనోజ్ కు ఆ అమ్మాయితో ఎప్పటినుంచో పరిచయం ఉందని.. వారిద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది.అటు మోహన్ బాబు సైతం తన కొడుకు మనోజ్ కు ఇంకో పెళ్లి చేసి తాను రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాడట. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: