నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల విషయంపై ప‌లు కోణాల్లో  కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి.  డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్‌రావు , సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీలపై స‌మంత కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం విధిత‌మే. దాదాపుగా  స‌మంత‌ను టార్గెట్ చేసి వార్త‌లు రాశారు. త‌న మీద త‌ప్పుడు వార్త‌లు రాసార‌ని, అదేవిధంగా సోష‌ల్ మీడియాలో   ప్ర‌చారం చేసిన వారిపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోర్టును ఆశ్ర‌యించింది స‌మంత‌.  సోమ‌వారం స‌మంత త‌రుపు న్యాయవాది మ‌రోసారి త‌మ వాద‌న‌లు వినిపించారు.

సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోరాడు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయ‌డం స‌రైంది కాద‌న్నారు. అనేక అవార్డులు, రివార్డులు సమంత తీసుకుందని కోర్టుకు బాలాజీ తెలిపాడు. అలాంటి వ్యక్తి పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విదంగా ప్రవరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాద‌న‌లు వినిపించారు. కేవ‌లం సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశార‌ని పేర్కొన్నాడు. ట్విట్టర్ వేదికగా విడిపోతున్నామని ప్రకటించగానే సోషల్ మీడియాలో విపరీతంగా సమంత పై ట్రోల్ లు చేశారని..సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు అని వ్యాఖ్యానించారు.

ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమ‌ని,  ఆమెకు అక్రమ సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని కోర్టుకు  న్యాయవాది తెలిపారు. తమ పిటీషన్ లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదని వెల్ల‌డించారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు.  గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచిందన్న బాలాజీ గుర్తు చేశారు. ఇరువురి వాద‌న‌లు పూర్త‌యిన త‌రువాత కూక‌ట్‌ప‌ల్లి కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. తీర్పు రేప‌టికి వాయిదా వేసింది. ఇప్ప‌టికే స‌మంత‌కు సంబంధించిన కేసు మొద‌ట గురువారం విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. గురువారం నుంచి శుక్ర‌వారం వాయిదా వేసింది. శుక్ర‌వారం తీర్పునిస్తూ.. ఇరువాద‌న‌లు విన్న త‌రువాత తీర్పుఇస్తామ‌ని సోమ‌వారం వారానికి వాయిదా వేసింది. సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టి తిరిగి మ‌ర‌ల మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. దీంతో స‌మంత కాస్త నిరాశ‌కు గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: