పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. ఆయన సినిమా అంటే సాధారణ జనాల నుంచి డై హార్డ్ ఫాన్స్ వరకు అందరికి ఏదో తెలియని ఉత్సహం. ఇక ఒకవేళ పవన్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఆ రేంజ్ వేరే ఉంటది. అయితే ఇప్పుడు పవన్ ఒక్కరే కాకుండా ఆయనకి తోడుగా భల్లాలదేవ రానా కూడా కలిసి భీమ్లా నాయక్ సినిమాతో రాబోతున్నారు.

ఈ సినిమాకి  క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే ఈ క్రేజ్ ని కాష్ చేసుకుందాం అని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ భీమ్లా నాయక్ నిర్మాతలకి ఒక దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చింది. దాదాపుగా 140 కోట్లని ఇచ్చి ఈ సినిమాని థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని కోరింది. కాకపోతే కరోన సమయంలోనే వకీల్ సాబ్ తో 130 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టారు పవన్ కళ్యాణ్ . వకీల్ సాబ్ ఇచ్చిన ధైర్యంతో నిర్మాతలు భీమ్లా నాయక్ ని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. అయితే ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రేంజ్ డీల్ ఇవ్వడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఒక వేళ ఈ భీమ్లా నాయక్ కనుక హిట్ అయితే మాత్రం ఎలా కాదు అనుకున్న కూడా 200 కోట్ల కలెక్షన్స్ ఖాయం.

ఇక ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది అని ఈరోజు నిర్మాతలు కూడా ఖరారు చేసారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తలబడి భీమ్లా నాయక్ ఎంత పెద్ద హిట్ అవుతుందో వేచి చూడాలి. ఈ సినిమా పాటలు కూడా ఇప్పటికే రెండు విడుదలై మంచి రెస్పాన్స్ తెచుకున్నాయి. టైటిల్ సాంగ్ దాదాపుగా 53 మిలియన్స్ వ్యూస్ రావడం విశేషం. అలాగే భీమ్లా నాయక్ టీజర్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: