తమన్నా కు సినిమాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ లకు మంచి స్పందన రావడంతో ఆమెతో ‘మాష్టర్ చెఫ్’ షోను హోస్ట్ చేయిస్తే ఆషోకు భారీ రేటింగ్స్ వస్తాయని జెమినీ టివి భావించి ఆమెతో ఈ షోను హోస్ట్ చేయించింది. తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్ చేసిన ఈకార్యక్రమాన్ని తమన్నా హోస్ట్ చేస్తూ ఉండటంతో చాల మంచి రేటింగ్స్ వస్తాయని జెమినీ టివి ఆశలు పెట్టుకుని ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలిసింది.

అయితే ఈ విషయంలో జెమినీ టివి అంచనాలు అన్నీ పూర్తిగా తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి ఇప్పుడు అనసూయ ముందుకు రావడమే కాకుండా ఆమె హోస్ట్ చేసిన మొదటి షో కూడ ప్రసారం అయింది. దీనితో తమన్నాను ఈ షో నుంచి ఎందుకు తీసివేసారు అంటూ చాలామంది ఆశ్చర్య పడినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఈ షోకి సంబంధించి తమన్నా ఎగ్రిమెంట్ ఇంకా పూర్తి కాలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో తమన్నాను తొలిగించి అనసూయను ఎంపిక చేయడం వెనుక తమన్నా అనసూయల పారితోషికంలో ఉన్న తేడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు బుల్లితెర పై అనసూయ హోస్ట్ చేసిన కార్యక్రమాలు అన్నింటికీ ఇప్పటివరకు మంచి రేటింగ్స్ రావడంతో ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని తమన్నా ప్లేస్ లో అనసూయ వచ్చి చేరింది అని అంటున్నారు.


వాస్తవానికి ఈ విషయమై అనసూయ ఇప్పటి వరకు స్పందించక పోయినప్పటికీ ఈ మార్పు పై తమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టాక్. అంతేకాదు తన లీగల్ ఎడ్వైజర్ ద్వారా ఈమార్పు ఎందుకు చేసారు అంటూ ఆమె జెమినీ టివి వారిని వివరణ అడుగబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న తమన్నా ప్లేస్ లోకి అనసూయ రావడం ఒక షాకింగ్ న్యూస్..


మరింత సమాచారం తెలుసుకోండి: