తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వందల కుపైగా చిత్రాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికలలో పోటీలో పాల్గొని ఓడిపోయారు. ఓటమి చెందినప్పటికీ ప్రకాష్ రాజ్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ ఓ ప్రముఖ ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకొచ్చారు.

అయితే ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ పెద్ద కూతురు పూజ ఇటీవలే తన చదువును పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చిందని దీంతో తన సినీ కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో పడిందని వెల్లడించారు. ఇక తన కూతురికి సంగీతంలో ఆసక్తి ఉందని దాంతో ఓ ప్రముఖ సంగీత దర్శకుడు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోందని తెలియజేశాడు. అంతేకాదు.. తన పెళ్లి విషయం గురించి మాట్లాడగా తనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకునే అవకాశం ఇచ్చానని కానీ వీరిద్దరి పెళ్లి మాత్రం తాను చేయనని అన్నారు. కానీ పెళ్లికి కావలసిన డబ్బు ఇస్తానని అలాగే కేవలం తనని పెళ్లికి పిలిస్తే వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తానని అన్నారు.

ఈ విషయానికి తన కూతురు పూజ కూడా వెంటనే ఓకే చెప్పిందని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ గా మారింది. ఇక జీవితంలో పెళ్లి, చావు, పుట్టుక, మంచి జీవితం, వంటివి చాలా అవసరమని అలాంటప్పుడు ఇలాంటి ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరవ్వకుండా చేసుకోవడంలో అర్థం లేదని నెటిజన్స్ వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: