టాలీవుడ్ లో ఒకప్పుడు బ్రహ్మానందం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపారు. అయితే గత నాలుగేళ్ల నుంచి బ్రహ్మానందం తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న కమెడియన్ గా బ్రహ్మానందం ఒక వెలుగు వెలిగారు. అయితే బ్రహ్మానందం భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో చాలామంది దర్శక నిర్మాతలు ఆయన పక్కన పెట్టడమే కాకుండా స్టార్ హీరోలు కూడా ఆయనను పక్కన పెట్టడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం బ్రహ్మానందం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు బ్రహ్మానందం విషయంలో కొంతమంది స్టార్ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని బ్రహ్మానందంకు మళ్లీ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని ఒక స్టార్ హీరో కూడా బ్రహ్మానందం ను తన సినిమాల్లో తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందంతో ఇటీవల శ్రీను వైట్ల మాట్లాడారని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. శ్రీను వైట్ల గతంలో బ్రహ్మానందంతో మంచి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల్లో బ్రహ్మానందం చేసిన కామెడీ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందంతో మరోసారి సినిమా చేసేందుకు శ్రీను వైట్ల సిద్ధమవుతున్నారని త్వరలోనే శ్రీను వైట్ల తో బ్రహ్మీ సినిమా మొదలు పెట్టడమే కాకుండా ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో బ్రహ్మానందంతో కడుపుబ్బ నవ్వించిన శ్రీను వైట్ల ఇప్పుడు కూడా అదే విధంగా ప్లాన్ చేశారు అని దీనికి సంబంధించిన స్టోరీ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. ఈసారి శర్వానంద్ తో  సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీనువైట్ల ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: