నటుల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సహజమే. అయితే సినీ బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి లేదా ఒకటి రెండు సినిమా చాన్స్ లకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మాత్రం అది పూర్తిగా వారి ప్రతిభ పైనే ఆధార పడుతుంది అన్నది వాస్తవం. ఇలా మూవీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలో కి స్టెప్ ఇన్ అయిన కొందరు నటులు ఇక్కడ నిలదొక్కుకోలేక రెండు మూడు చిత్రాలకే వెనుతిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి కొందరు తమ వారికి మించిన సూపర్ క్రేజ్ తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే లిస్ట్ లో శ్రీకాంత్ నట వారసుడు రోషన్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయమయిన రోషన్, ఒక పూర్తి స్థాయి హీరోగా పెద్దయ్యాక పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.

మొదట ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వినిపించినా పోను పోను సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అక్టోబర్ 15న దసరా కానుకగా మన ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ఈ మూవీ ఇప్పుడు ఎక్కడలేని ఆదరణను పొందుతోంది. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదట్లో ప్లాప్ టాప్ వినిపించగా ఇక ఈ చిత్రం దసరా రేసులో కనీసం వారమైనా నిలబడుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఇపుడు సక్సెస్ఫుల్ సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొంది కాసుల వర్షం కురిపిస్తోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో, కీరవాణి సంగీతంతో రూపొందిన ఈ సినిమా మొదటి ఒకటి రెండు రోజులు కాస్త టెన్షన్ పెట్టినా ఆ తర్వాత బాగానే వసూళ్లను రాబడుతోంది.

ఇక ఇందులో రోషన నటన సూపర్ అంటూ శ్రీకాంత్ ను మించిన సహజ నటనను ఇతడు కనబరిచాడు అంటూ ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అంతేకాదు ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో అటు హీరోయిన్ కి ఇటు హీరో రోషన్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఓ టాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఇప్పటికే రోషన్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోషన్ జోరు చూస్తుంటే తండ్రిని మించిన తనయుడిగా క్రేజ్ పెంచుకుని స్టార్ హీరోగా టాలీవుడ్  సుదీర్ఘ కాలం రాణిస్తాడని అంత అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: