తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్ అభిమానులే. అభిమానుల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా ఉండదు. తను ఏ సినిమా ఓకే చేసినా.. ఆ సినిమా హిట్ అని దర్శకనిర్మాతల అభిప్రాయం. పవర్ స్టార్ నటించింది కొన్ని సినిమాలే అయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ ఉంటుంది. సినిమాలకు దూరమై.. రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా అభిమానులు పవన్ కళ్యాణ్‌ను వదలలేదు. రాజకీయాల్లోనూ అంతే ఆదరిస్తున్నారు. అయితే కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. చాలా సినిమాలు అభిమానులు, ప్రేక్షకులను అలరించలేకపోయాయి. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ నటించిన ‘జానీ’ మూవీ కూడా ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కాంబినేషన్‌లో మొదట్లో నటించిన ‘బద్రి’ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జానీ’ సినిమా మాత్రం మొత్తానికి ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నచ్చిన విధంగా స్టోరీని మార్చారంట. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని టాక్. జానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నటించిన సినిమాలపై కూడా ప్రభావం పడింది. దీంతో వరుస ఫ్లాపులతో నష్టాన్ని చవిచూశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జతగా సమంత నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ అయిన తర్వాత పవర్ స్టార్ రాజకీయాల్లో ప్రవేశించారు. ఊహించిన స్థాయిలో రాజకీయాల్లో ఆదరణ రాలేదు. అయినా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ‘వకీల్ సాబ్’ సినిమా ద్వారా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: