ఇటీవలి కాలంలో తన తెలుగులో కొన్ని కొన్ని వివాదాలు బాగా హల్చల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఏదో చిన్న పుకారు వస్తే దాన్ని పెద్దగా హైలెట్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తూ ఉంటారు కొంత మంది నెటిజన్లు. ప్రస్తుతం ఇది కొంత మంది సినీ ప్రముఖుల కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఉండటం కూడా కాస్త ఆందోళన కలిగించే అంశంగా టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో కొంతమంది దర్శక నిర్మాతలు చేసే సినిమాలు అదే విధంగా కొంతమంది స్టార్ హీరోల తండ్రులు చేసే సినిమాలు కాస్త వివాదాల దిశగా వెళుతున్నాయి.

ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనే దానిపై క్లారిటీ లేకుండానే సోషల్ మీడియా మొత్తం కూడా అనేక పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక నిర్మాతకు అలాగే ఆయన కొడుకు మధ్య వివాదం నడుస్తోంది అని గత కొంతకాలంగా సంపాదనలో దూసుకుపోతున్న కొడుకు తండ్రి విషయంలో లెక్కచేయకుండా ఉంటున్నాడని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఎప్పటినుంచో ఆస్తి తగాదాలు ఉన్నాయని సోదరుడికి ఆస్తి ఎక్కువగా ఇవ్వటం స్టార్ హీరోకి నచ్చడం లేదని అంటున్నారు. దీంతో ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదని తండ్రి కూడా వేరే ఉంటున్నారు అని అంటున్నారు.

ఇటీవలి కాలంలో విలన్ పాత్రలు ఎక్కువగా చేయడానికి రెడీ అవుతున్న హీరో తండ్రి మాట పెద్దగా లెక్క చేయడం లేదని అలాగే తన సోదరుడిని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అయితే ఈ వివాదం పరిష్కారం కోసం ఒక టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగారని ఆయన సరే ఈ వివాదం సమసిపోయే అవకాశాలు పెద్దగా కనపడటం లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇది ఏ విధంగా సర్దుబాటు అవుతుంది ఏంటి అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: