మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ మలుపు తిరుగుతాయి ఏమిటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో మెగా ఫ్యామిలీ ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంచు ఫ్యామిలీ ని ఎలా అయినాసరే కట్టడి చేయాలని ప్రయత్నం చేయడం ఆ తర్వాత ప్రకాష్ రాజు చేసిన విమర్శలు అన్నీ కూడా సంచలనం గా మారిపోయాయి. టాలీవుడ్ లో ప్రముఖులు అందరు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద ఎక్కువగా దృష్టి సారించి వివాదాలకు కూడా ప్రయత్నాలు చేశారని వార్తలు వినిపించాయి.

అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వకుండా కేవలం సైలెంట్ గా ఉండి ఓటు వేసి వచ్చారు. అయితే మంచు మోహన్ బాబు కుటుంబానికి ఆయన మద్దతు ఇచ్చారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో కాస్త ఎక్కువగానే జరిగింది. అయితే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఆ బాలకృష్ణ విషయంలో మాత్రం మంచు మోహన్ బాబు చాలా జాగ్రత్తగా స్పందించారు. తన కొడుకుని గెలిపించినందుకు బాలకృష్ణ ఇంటికి వెళ్లి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెట్టారని కొంతమంది మెగా ఫ్యామిలీలో ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మెగా ఫ్యామిలీ లో కొంతమంది అల్లు అరవింద్ తో చర్చల కోసం ప్రయత్నాలు చేసినా బాలకృష్ణ తో అల్లు అరవింద్ చేస్తున్న షో వద్దని చెప్పిన అల్లు అరవింద్ మాత్రం వినలేదు అని అంటున్నారు. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ విషయంలో పెద్దగా ఎక్కడా స్పందించే ప్రయత్నం చేయకపోయినా ఆయన బాలకృష్ణను పొగడటం చాలామందికి నచ్చడం లేదని పుకార్లు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఇటువంటి అనవసరమైన వార్తలు మాత్రం టాలీవుడ్  లో  లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: