తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల తార ఆసిన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆసిన్ వ్యక్తిగత విషయంలోకి వెళ్తే.. ఆమె కేరళలోని కొచ్చిలో 1985 అక్టోబర్ 26న జన్మించారు. ఆసిన్ కి బాల్యంలోనే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె మాతృభాషతో పాటు దక్షిణాది అన్ని భాషలనూ చిన్నతనంలోనే నేర్చుకున్నారు. ఆసిన్ ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఇటాలియన్ భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగలదు. అంతేకాదు.. ఆమె నటించిన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా అసిన్ కు చాలా ఇష్టమంట.

అయితే ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయని అందుకుంది. అలాగే పూరి దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘శివమణి’లోనూ ఆసిన్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, వెంకటేశ్ తో ‘ఘర్షణ’లోనూ హీరోయిన్ గా నటించారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ముగ్గురూ పోలీస్ ఇన్ స్పెక్టర్స్ గా నటించిన చిత్రాలలోనే అసిన్ కథానాయికగా నటించారు. ఈ నాలుగు సినిమాలతో ఆసిన్ చెరగని ముద్ర వేసుకుంది.

ఆసిన్ హీరోయిన్ గా రాణిస్తూనే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ చేశారు. ఆమె “అవన్, మిరిండా, కాల్గేట్, ఫేయిరెవర్, తనిష్క్, బిగ్ బజార్, ప్యారాచూట్, లక్స్, అమృతాంజన్ హెల్త్ కేర్” వంటి ప్రముఖ సంస్థలకు అసిన్ మోడల్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే 2016లో రాహుల్ శర్మను పెళ్ళాడిన అసిన్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసందే. వీరిద్దరికి ఓ పాప పుట్టింది. ఆమె పేరు అరిన్. ఇక ఇప్పటికి  అసిన్ చిత్రాలు బుల్లితెరపై ప్రదర్శితమవుతూ ఉంటే అభిమానులు ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం అనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: