టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో కొంత మంది స్టార్ హీరోలు నిర్మాతలుగా మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంత మంది స్టార్ హీరోలు నిర్మాతలుగా మారడానికి దర్శకులతో చర్చలు జరిపి అలాగే గతంలో నిర్మాతలుగా చేసిన వాళ్లతో చర్చలు జరిపి ఈ మధ్య కాలంలో తన నిర్మాణ సంస్థలో ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల నుంచి నిర్మాణ సంస్థ పెడతారనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా సందడి చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నిర్మాణ సంస్థ విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నాడని త్వరలోనే నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి రెడీ అయ్యాడని తన కుమార్తె పేరు తో నిర్మాణ సంస్థను రిజిస్టర్ కూడా చేశాడని అంటున్నారు. దీనికి సంబంధించి అల్లు అరవింద్ కూడా సహకారం అందిస్తున్నారని అల్లు స్నేహారెడ్డి దీనికి చైర్మన్ గా వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావడమే కాకుండా ఈ బ్యానర్ లో సినిమా కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఒక స్టార్ హీరో చాలా ఆసక్తి చూపిస్తున్నాడని స్టార్ హీరోతో అల్లు అర్జున్ నిర్మాతగా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని అయితే నిర్మాతగా పేరు మాత్రం అల్లు స్నేహారెడ్డి పేరు ఉంటుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు ముందుకు రాబోతుంది ఏంటి అనేది తెలియాల్సివుంది. అల్లు స్నేహ రెడ్డి ఇటీవల కొంతమంది యువ రచయితల కథలు వింటున్నారని త్వరలోనే ఒక చిన్న సినిమా కూడా మొదలు పెట్టడానికి ఆమె సిద్ధమయ్యారని ప్రచారం ఉంది. మరి ఇది ఎంత వరకు ముందుకు వెళ్లబోతుంది ఏంటి అనేది త్వరలోనే  క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: