ఈ మధ్య కాలంలో కొంత మంది స్టార్ హీరోలు ఎక్కువగా విదేశాల్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. స్టార్ హీరోలు కొంత మంది విదేశాల్లో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది నిర్మాతలు విదేశాల్లో సినిమాలు చేయటానికి సిద్దమవుతున్నారు అని ప్రచారం ఉంది. అయితే మరికొంత మంది దర్శకులు మాత్రం విదేశాల్లో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తో కొరటాల శివ చేయబోయే సినిమాకు సంబంధించి లండన్ లో షూటింగ్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తర్వాత సినిమాను కూడా లండన్ లో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారని దీనికి సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. లండన్ దగ్గరలో ఒక గ్రామంలో దీనికి సంబంధించి షూటింగ్ చేస్తారని త్వరలోనే రామ్ చరణ్ అక్కడికి వెళ్లే అవకాశం ఉందని ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్న సినిమా డబ్బింగ్ పనులు పూర్తి కావడంతో తర్వాత సినిమా మీద దృష్టి పెట్టాడని సమాచారం.

దీనికి సంబంధించి రామ్ చరణ్ ఇప్పటికే కసరత్తులు కూడా మొదలు పెట్టాడని అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కాస్త లావుగా కనబడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.అలాగే తన హెయిర్ స్టైల్ లో కూడా రామ్ చరణ్ మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళి తో చేసే సినిమాల్లో తనకు గాయాలయ్యాయని ఆ సినిమాకు సంబంధించి ఇబ్బంది రాకుండా ఉండడానికి షూటింగ్ కొనసాగించాలని అయితే ఇప్పుడు లండన్ వెళ్లి దానికి చికిత్స తీసుకుని ఆ సినిమా షూటింగ్  కొన్ని సన్నివేశాలను పూర్తి చేసుకుని వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: