బిగ్ బాస్.. బుల్లితెర చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతుంది.  బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గదు అని చెప్పడంలో అతిశయోక్తి. అయితే బిగ్బాస్ కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషలలో కూడా ప్రస్తుతం ప్రసారం అవుతూ ఉంది అనే విషయం తెలిసిందే. ఇక అన్నీ ఇండస్ట్రీలలో కూడా బిగ్బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ ఉండటం లాంటివి చేస్తున్నారు. ఇలా అన్ని భాషల ప్రేక్షకులకి కూడా బిగ్బాస్ కార్యక్రమం సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. అయితే మనకు తెలిసిన సినీ సెలబ్రిటీలు సినిమాల్లో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే..  ఎలా నటిస్తారు ఎలా హావభావాలు పలికిస్తారు అన్నది కూడా తెలుసు  కానీ మనకు తెలిసిన సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఇక ఆ విషయాన్ని తెలియజేస్తుంది. బిగ్బాస్ కార్యక్రమము మనకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఎప్పుడూ ఒక కన్ను బిగ్బాస్ ఇంటి పై వేసి ఉంచుతారు అని చెప్పాలి.  ఇకపోతే అటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ కి పలువురు సినీ సెలబ్రిటీలు మద్దతు ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ హీరో రానా  భార్య మహిక అటు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి మద్దతు ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. అయితే తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తమిళ బిగ్ బాస్ షోలో హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన అక్షరకు రానా భార్య మహిక సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ లో పాల్గొన్న క్లోజ్ ఫ్రెండ్ అక్షరకే తన ఓటు అంటూ తెలిపింది.  ప్రేక్షకులు కూడా ఆమెకి ఓటేస్తారు అంటూ భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అక్షర ఎలాగైనా బిగ్ బాస్ షో విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది రానా భార్య మహిక. కాగా అక్షర  2019 మిస్ గ్లోబ్ గెలుచుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: