టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత వివాదాలు ఎక్కువగా పెరుగుతున్నాయని వార్తలు మనం ఎక్కువగా చూస్తున్నాం. కొంతమంది టాలీవుడ్  లో   ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని మెగా ఫ్యామిలీకి అనుకూలంగా లేని వారి విషయంలో ఇబ్బందికర పరిణామాలు టాలీవుడ్  లో  ఎదురవుతున్నాయని కొంతమందిని అవమానపరిచే విధంగా కొంత మందిని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు విషయంలో మెగా ఫ్యామిలీకి అనుకూలంగా ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చి కూడా వాళ్ల ను పక్కన పెట్టేశారు అని అంటున్నారు.

కోట శ్రీనివాసరావు మంచు మోహన్ బాబు కి మద్దతు ఇవ్వడం ఇక్కడ పెద్ద సమస్య అయింది అందుకే మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆయన విషయంలో చాలా సీరియస్ గా ఉందని ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు కోట శ్రీనివాసరావు విషయంలో అల్లు అర్జున్ చాలా సానుకూలంగా  ఉన్నాడని ఇటీవలే తన సినిమాలో కూడా అవకాశం ఇస్తానని చెప్పాడు అని అంటున్నారు. కోటా శ్రీనివాస రావు కి స్వయంగా అల్లు అర్జున్ ఫోన్ చేసి మాట్లాడాలని టాలీవుడ్ లో ఆయన చేసిన సేవలను ప్రస్తావిస్తూ అండగా ఉంటానని చెప్పారని అంటున్నారు.

కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల పట్ల అలాగే కోట శ్రీనివాస రావు పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చాలా చర్చ ప్రధానంగా మెగా బ్రదర్ నాగబాబు ఆయనను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ లో కొంతమంది ని బాగా ఇబ్బంది పెట్టిందనే విషయం క్లియర్ గా చెప్పవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే కోట శ్రీనివాసరావు అల్లు అర్జున్ అండగా నిలబడటం మాత్రం టాలీవుడ్లో బాగా హాట్ టాపిక్ అయింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఏ ఏ సినిమాల్లో కూడా శ్రీనివాసరావు కనిపించబోతున్నారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: