తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి.. తన సొంత టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి కొన్ని కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఇక ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్న చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన సాహసం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు అనే గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని. చిరుని కలవాలని ఈ నెల 3వ తేదీన అమలాపురం నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టి.. ఇరవై మూడు రోజుల పాటు ఏకంగా 727 కిలోమీటర్లు నడిచి సోమవారం నాడు హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి చేరుకున్నాడు. ఇక తనపై ఉన్న అభిమానంతో అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఇన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు ఆశ్చర్యపోయిన మెగాస్టార్.. వెంటనే గంగాధర్ ని స్వయంగా ఇంటికి పిలిపించుకొని కాసేపు  ముచ్చటించారు. దాంతో ఆ అభిమాని ఆనందంలో మునిగి తేలాడు.
 

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ గా మారుతున్నాయి. ఇక గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న ప్రత్యేక అభిమానం తో చాలామంది అభిమానులు పాదయాత్రలు చేశారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే గంగాధర్ అనే వ్యక్తి ఒక దివ్యాంగుడు. మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో ఎలాగైనా ఆయన్ను కలవాలని తన అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయలేదు. దీంతో ఆ అభిమానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా అభిమానులు. ఇక మెగాస్టార్ సినిమా విషయానికొస్తే.. ఇటీవలే ఆచార్య షూటింగ్ ని పూర్తి చేసిన ఆయన.. అతి త్వరలోనే గాడ ఫాదర్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు. మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: