బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ కు పాన్ ఇండియా స్టార్ గా బిరుదు వ‌చ్చింది. అయితే అలాంటి పాన్ ఇండియా స్టార్ తో పాన్ ఇండియా రేంజ్ లో సాహో అనే సినిమా తిసిన డైరెక్ట‌ర్ సుజిత్ గురించి చాలా మందికి తెలియ‌దు. సుజిత్ 28 ఏళ్ల చిన్న వ‌య‌స్సు లోనే సాహో అనే పాన్ ఇండియా సినిమా ను చేసి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందాడు. అలాగే సాహో ఆయ‌న ద‌ర్వ‌కత్వం వ‌హించిన రెండో సినిమా కావ‌డం విశేషం. అయితే సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సిన‌మా ర‌న్ రాజా రన్. ఈ సినిమా ను తెర‌కెక్కించిన నాటికి సుజిత్ వ‌య‌స్సు కేవ‌లం 21 సంవ‌త్స‌రాలే. అయితే ఇంత చిన్న వ‌య‌స్సు లోనే పెద్ద పెద్ద సినిమా ల‌కు ద‌ర్శ‌ర‌త్వం వ‌హించిన సుజిత్ కు ఇండ‌స్ట్రీ లో మంచి పేరే ఉంది.



సుజిత్ చిన్న వ‌య‌స్సు లో తాను డైరెక్ట‌ర్ కావాల‌ని అనుకొలేద‌ట‌. తాను క‌ష్ట ప‌డి చ‌దివి ఎలాగైనా చార్ట‌ర్డ్ అకౌంటెంట్ కావాల‌ని అనుకున్నాడ‌ట‌. ఆయ‌న గోల్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమా రంగం వైపు ఆక‌ర్షితుడు అయ్యాడ‌ట‌. దీంతో కాలేజ్ వ‌య‌స్సు లోనే షార్ట్ ఫీల్మ్స్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అంతే కాకుండా త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు స‌హాయం తో  త‌న 17 ఏళ్ల వ‌య‌స్సు లోనే షార్ట్ ఫీల్మ్ తీశాడ‌ట‌. అలా కొన్ని షార్ట్ ఫీల్మ్స్ తీసిన త‌ర్వాత ఎదైనా సినిమా కు డైరెక్ష‌న్ చేయాల‌ని అనుకున్నాడు. దీంతో ర‌న్ రాజ ర‌న్ క‌థ ను తానే రాసుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దీని త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో సాహో అనే పాన్ ఇండియా లెవ‌ల్ సినిమా ను తెర‌కెక్కించాడు. అలా డైరెక్ట‌ర్ సుజిత్  సీఏ నుంచి ష్టార్ ఫీల్మ్స్ నుంచి డైరెక్ట‌ర్ గా ఎదిగాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: