సినీ ఇండస్ట్రీలో ఆయన ఒక్క సెన్సేషనల్ డైరెక్టర్..ఆయన పేరు ఒక సంచలనం. ఒకప్పుడు ఆయన సినిమా వస్తున్నాయంటే ధియేటర్స్ కు పరుగెత్తుకుని వెళ్లి చూసేవాళ్లు. అప్పట్లో ఆయన సినిమాలు తీస్తే అది సినీ చరిత్రను తిరగరాయాల్సిందే.. మరి ఇప్పుడు ఆయన సినిమా వస్తున్నాయంటేనే..గుండెల్లో దడ మొదలు అవుతుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తాడొ అని భయమేస్తుంది. ఇక ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తే భారీ డిజాస్టర్ గా నిలుస్తుంది. బాక్స్ ఆఫిస్ దగ్గర ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బొక్కబోర్లా పడుతుంది. ఇప్పటికే అర్ధమైపోయిఉంటుందిగా ఆ డైరెక్టర్ ఎవరో..? యస్.. మీ గెస్సింగ్ కరెక్ట్. ఆయనే ది వన్ అండ్ ఓన్లీ కంట్రవర్షియల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.

రాం గోపాల్ వర్మ..ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎందుకంటే..??  ఆయన మాటలతో, వ్యవహార శైలితో, ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటారు.  వర్మ రూటే సపరేటు. ఆయనకు నచ్చితే మ్యాటర్ ఒక్కలా ఉంటుంది. నవ్వుతూ సమాధానమిస్తాడు... లేదంటే అంతే సంగతులు చిటపట చిందలేస్తూ.. ముఖానే తిట్టేస్తాడు. తనని అడగకపోయిన ..ఆ విషయంలో తన అవసరం లేకపోయినా.. కావాలని మనుషులను రెచ్చకొట్టడంలో ఆయనకు సరిలేరు ఎవరు. ఇక ఈ దూకుడు తోనే ఆయన మంచి అవకాశాలను మిస్ చేసుకున్నాడు.

ఆర్జీవీ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి రాకముందు అమీర్ పేటలో సినిమా క్యాసెట్స్ షాప్ రన్ చేసేవారట. ఇక అలా అక్కడికి వచ్చిన సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఓ కథను రాసుకుని ఫస్ట్ అక్కినేని వెంకట్‌కు చెప్పారు.కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే  డైరెక్షన్ నేర్చుకుంటాను.. ఏదైన సినిమాకి అసిస్టెంట్‌గా ఛాన్స్ ఉంటే  ఇవ్వమని వెంకట్‌ని అడిగారు. ఇక అప్పుడు నాగార్జున హీరోగా నటిస్తున్న కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అయినా ఏం లాభం ..ఆయన దూకుడు తో..మొండితనంతో ..తన ప్రవర్తనతో అక్కడ ఉన్న వారిని విసికించారు. ఇక అక్కడ పని చేసే వాళ్ళు కూడా వర్మ ఉంటే మేము సినిమాకి వర్క్ చేయము అనే వరకు వచ్చేసారు. దెబ్బకు ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్న బి. గోపాల్ ఆయను తీసేసారు. కానీ  వర్మ అక్కడే దూరంగా ఉండి  డైరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఫైనల్ గా మంచి డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: