టాలీవుడ్ లో అటు నందమూరి ఫ్యామిలీకి ..ఇటు అక్కినేని ఫ్యామిలీకి ఎంతో మంచి పేరు ఉంది. లెజండరీ నటుడు నందమూరి తారక రామరావు దగ్గర నుండి యంగ్  టైగర్ తారక్ వరకు..అక్కినేని నాగేశ్వర రావు దగ్గర నుండి ఇటు అఖిల్ వరకు..వీళ్ల స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో నాగేశ్వరరావు-తారక రామరావు ఇద్దరు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వాళ్లు ఇద్దరు తెర పై కనిపిస్తే బోమ్మ బ్లాక్ బస్టర్ నే  అవుతుంది అనేవాళ్లు.

ఇక రెండు కుటుంబాల్లో  ఏ చిన్న ఫంక్షన్ జరిగినా..మొత్తం ఫ్యామిలీ హాజరవుతారు. బాలకృష్ణ-నాగార్జున  కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. ఎప్పటి నుండో తరాలుగా కొనసాగుతున్న వీళ్ల స్నేహ బంధాని..ఇంకో మెట్టు ఎక్కించి వియ్యంకులు అవుదాం అని అనుకున్నారట. అనుకోవడమే కాదు. ఆ ప్లాన్ ని అమలు కూడా చేయడానికి రెడి అయ్యారట. కానీ మధ్యలో సమంత వచ్చి మొత్తం సర్వ నాశనం చేసేసిందని అంటున్నారు.

యస్.. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న నాగార్జున బాలయ్య వియ్యంకులుగా మారాలి అనుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు మనవుడు..నాగార్జున పెద్ద కొడుకు నాగాచైతన్య ని బాలకృష్ణ రెండో అమ్మాయి నందమూరి తేజశ్విని కి ఇచ్చి పెళ్లి  చేద్దాం అనుకున్నారట. పెద్దలు కూడా అన్నీ మాట్లాడేసుకున్నారట. ఇక నాగార్జున వెళ్లి చై కు ఈ పెళ్లి గురించి చెప్పితే..అప్పుడు మనోడు అసలు మ్యాటర్ బయట పెట్టారట. అప్పుడే వచ్చిన ఏ మాయ చేశావే అనే సినిమా టైంలో నాగచైతన్య సమంత తో లవ్ లో పడటం..ఇక వాళ్ల పెళ్ళి జరగడం..చివరకు విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యిపోయారు.  అప్పటి వరకు ఈ సమంత నాగ చైతన్య లవ్ విషయాని బయటపడకుండా బాగా కవర్ చేసుకున్నారట. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య  తన కూతురికి భరత్ అనే అబ్బాయిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: