టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. కానీ తాను చేయాల్సిన ఐకాన్ ప్రాజెక్టును మాత్రం పక్కన పెట్టేసాడు. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయ. దిల్ రాజు నిర్మాణంలో దాదాపు మూడేళ్ళ క్రితం 'ఐకాన్' అనే సినిమాని ప్రకటించారు. దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పిన కాన్సెప్ట్ తనకు చాలా బాగా నచ్చిందని బన్నీ కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇక ఐకాన్ సినిమా చేసే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురంలో, సుకుమార్ ప్రాజెక్టులను అప్పటికే ఓకే చేశాడు బన్నీ.

 అయితే ఐకాన్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మిగిలిన రెండు ప్రాజెక్టులను పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే పుష్ప పార్ట్1 షూటింగ్ అనంతరం ఐకాన్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టాలని రీసెంట్ గానే అని అనుకున్నాడు బన్నీ. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా తీసి మంచి హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ పై బన్నీ కి నమ్మకం పెరిగి ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే. ఇప్పుడు మళ్ళీ బన్నీ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు ఫిలింనగర్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

 పుష్ప షూటింగ్ అనంతరం బోయపాటి శ్రీను తో బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది.  బాలకృష్ణ తో బోయపాటి చేస్తున్న 'అఖండ' విజయం సాధిస్తే ఆలస్యం లేకుండా వెంటనే అల్లు అర్జున్ బోయపాటి శ్రీను ల సినిమా పట్టాలెక్కనుందిట.దీంతో 'ఐకాన్' ప్రాజెక్ట్ మళ్లీ మూలన పడిపోయినట్లే అంటున్నారు. ఏదేమైనా పుష్ప పార్ట్ 1 తర్వాత బన్నీ నటించిబోయే తర్వాతి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్  విలన్ గా కనిపించబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: