టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది కి హిట్ దొరకకున్నా కూడా అలుపెరుగకుండా హిట్ కోసం సినిమా ల మీద సినిమాలు చేస్తూనే ఉంటారు. ప్లాప్ లతో హిట్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి వరుస సినిమాలు చేసే హీరో లలో ఒకరు నాగ శౌర్య. ఆయనకు హిట్ వచ్చి చాలా సంవత్సరాలే అయిందని చెప్పొచ్చు. వెంకీ కుడుముల దర్శకత్వంలో అయన చేసిన ఛలో సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా తర్వాత ఇంతవరకు మళ్ళీ హిట్ మొహం చూసింది లేదు నాగ శౌర్య..

ముఖ్యంగా అయన సినిమాల ఎంపిక లో లోపమే ఆయనకు హిట్ దక్కకపోవడానికి కారణం. ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ డజను సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. దాంతో అయన హిట్ సినిమా ను తొందరగా మర్చిపోతారు ప్రేక్షకులు. ఇండస్ట్రీ కి వచ్చి చాలా రోజులే అయినా కూడా నాగ శౌర్య ఇంకా నార్మల్ హీరోగా కూడా ఎదగకపోవడం అయన అభిమానులకు కొంత నిరాశనే ఇస్తుంది చెప్పొచ్చు. ఇక తాజాగా అయన వరుసగా రెండు సినిమాలను పది రోజుల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

రీతూ వర్మ హీరోయిన్ గా అయన హీరో గా చేస్తున్న వరుడు కావలెను సినిమా ఈనెల 29 న విడుదల కాబోతుండగా, అయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన లక్ష్య చిత్రం కూడా పది రోజులకే నవంబర్ 12 న రాబోతుంది. అంటే కేవలం పది రోజుల వ్యవధిలో నే తన అదృష్టాన్ని రెండు సార్లు పరీక్షించుకోనున్నారు నాగ శౌర్య. మరి ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమా అయినా హిట్ అవుతుందా అనేది చూడాలి. అయన గత చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. అంతేకాదు అయన ఆ సినిమా ల వల్ల ఉన్న ఉన్న క్రేజ్ ను పోగొట్టుకునే స్టేజి లో ఉన్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఆయనకు ఎలాంటి అనుభవాలను మిగులుస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: