మధ్య కాలంలో టాలీవుడ్ లో ఒక హీరో సినిమా కోసం మరొక హీరో గెస్ట్ గా వెళ్లడం ఎక్కువ అవుతుంది. పెద్ద పెద్ద హీరో లు సైతం తోటి హీరోల సినిమాల కోసం వెళుతున్నారు. చిన్న హీరోలైనా వెళుతూ వారిలోని స్నేహ భావాన్ని వెల్లడిస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ , ప్రభాస్ లు కలిసి పూరి తనయుడు సినిమా రొమాంటిక్ సినిమా కి హోస్ట్ చేసి సినిమా ని ప్రమోట్ చేశారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి వారు కూడా వెళుతూ తోటి హీరోల సినిమాలకు చేయూతనిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ కోసం అల్లు అర్జున్ వెళ్లడం ఒక్కసారిగా అందరిలో ఎంతో ఆసక్తి ని రేపుతోంది.

ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తన మూడో సినిమా ను పూర్తి చేశాడు. నూతన దర్శకుడితో కలిసి పుష్పక విమానం అనే క్లాసిక్ టైటిల్ తో నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆనంద్. ఈనేపథ్యం లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనం గా చేయబోతుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా లో ఈమేరకు ఈ న్యూస్ ఫుల్ పబ్లిసిటీ అవుతుంది.

మొదటినుంచి అల్లు అర్జున్ కు దేవరకొండ బ్రదర్స్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో విజయ్ దేవరకొండ గీత గోవిందం అనే సినిమా చేయగా ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పటినుంచి మెగా కాంపౌండ్ లో విజయ్ దేవరకొండ అందరిలో ఒకరిగా కలిసిపోయాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఆ అనుబంధమే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పక విమానం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి అల్లు అర్జున్ రావడానికి కారణం అయ్యింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: