స‌మంత‌, నాగ‌చైత‌న్య దంప‌తులు విడాకులు ప్ర‌క‌టించిన స‌మ‌యం నుంచి నెట్టింట్లో చ‌ర్చ‌లు విప‌రీతంగా పెరిగాయి. వీరి విడాకులపై ఎన్నో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.   అంద‌రూ స‌మంత‌నే టార్గెట్ చేసి ప‌లు క‌థ‌నాలు రాశారు. కొంత‌మంది ఏకంగా హ‌ద్దులు దాటారు. డిజైన‌ర్‌, స్టైలిష్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్‌కు స‌మంత‌కు రిలేష‌న్ ఉన్న‌ద‌ని ప‌లు పుకార్లు వినిపించారు. ఇంత‌కు ముందే అబార్ష‌న్ చేయించుకుంద‌ని నానా ర‌కాలుగా ప్ర‌చారం చేశారు. త‌న మీద త‌ప్పుడు వార్త‌లు రాసి ప్ర‌చారం చేసిన వారిపై చ‌ర్య‌ల‌కు దిగింది స‌మంత‌.

డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్‌రావు స‌మంత గ‌ర్భం దాల్చ‌డంపై చేసిన వ్యాఖ్య‌లు విధిత‌మే. ఆయ‌న‌తో పాటు  సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీలు చేసిన ప్ర‌సారాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని.. తన పరువుకు భంగం క‌లిగింద‌ని, అస‌త్యాలు ప్ర‌చారం చేశారంటూ  ఇటీవ‌ల ప‌రువున‌ష్టం దావా వేసింది స‌మంత‌. ఆమె త‌రుపున న్యాయ‌వాది బాలాజీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో. పిటీష‌న్ దాఖ‌లు చేసిన స‌మ‌యంలో త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని న్యాయ‌వాది కోర‌డం గ‌మ‌నార్హం.  జ‌డ్జీ అందుకు కాస్త గ‌రం అయి కోర్టుకు అందరూ స‌మాన‌మేన‌ని స‌మాధానం చెప్పారు.

తెలుగులో అత్యంత పాపుల‌ర్ న‌టిని. దాదాపు 45 సినిమాల్లో న‌టించాను. 4 ఫిలింఫేర్ అవార్డులు, నందిఅవార్డులు 2, సౌత్ ఇండియా అవార్డులు 6, 3 సినిమా అవార్డుల‌ను అందుకున్న‌ట్టు తెలిపింది. 12 మ‌ల్టినేష‌న‌ల్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిట‌ర్ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి చేనేత బ్రాండ్ అంబసిడ‌ర్‌గా ప‌ని చేశాన‌ని గుర్తు చేశారు. త‌న‌ను సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీలు, డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్‌రావు   టార్గెట్ చేశారని స‌మంత కోర్టుకు ఆవేద‌న‌ను వెల్ల‌బుచ్చింది. త‌న‌కు అఫైర్లు అంట‌గ‌ట్టిన వెంక‌ట్రావుపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు.. యూట్యూబ్ చాన‌ళ్ల నుంచి లింకులు తొల‌గించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును కోరింది. అదేవిధంగా గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచిందని న్యాయ‌వాది బాలాజీ గుర్తు చేశారు.

తొలుత ఈ కేసుపై ఈనెల 21న విచార‌ణ చేప‌ట్టిన కూక‌ట్‌ప‌ల్లి కోర్టు అక్టోబ‌ర్ 22కు వాయిదా వేసింది. ఇరువాద‌న‌లు విన్న త‌రువాత తీర్పు ఇస్తామ‌ని అక్టోబ‌ర్ 22 న కోర్టు పేర్కొంది. మ‌ళ్లీ అక్టోబ‌ర్ 25కు వాయిదా వేసింది. ఆతరువాత అక్టోబ‌ర్ 26కు వాయిదా వేసింది కోర్టు. తాజాగా తీర్పును ఇస్తూ.. సోష‌ల్ మీడియాలో స‌మంత వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను పోస్ట్ చేయ‌వ‌ద్దు. యూట్యూబ్ చాన‌ళ్లు వెంట‌నే స‌మంత‌కు సంబంధించిన కంటెంట్‌ను తొల‌గించాల‌ని, అదేవిధంగా సీఎల్ వెంక‌ట్‌రావు కంటెంట్ తొల‌గించాల‌ని కూక‌ట్‌ప‌ల్లి కోర్టు స్ప‌ష్టం చేసింది.  మంగ‌ళ‌వారం ఇంజెక్ష‌న్ ఆర్డ‌ర్ ద్వారా కోర్టు అమ‌లు చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: