ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని టాలీవుడ్ టూ బాలీవుడ్.. అన్నివర్గాల ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తుంది.ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సమీపిస్తున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిసారించిందని తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ని దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్త వినిపిస్తుంది.. ఆర్ఆర్ఆర్ మూవీని వరల్డ్ వైడ్‌గా తెలుగు మరియు తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ దృష్టి ఆకర్షించే పథకంలో భాగంగానే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ నుంచి వార్త వినిపిస్తుంది..

దుబాయ్‌లో జరిగే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ హీరోను చీఫ్ గెస్టుగా ఆహ్వానించనున్నట్టుగానూ ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయని తెలుస్తుంది.. ఫిలింనగర్‌లో జరుగుతున్న ఈ ప్రచారం సంగతి ఇలా ఉంటే, ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తుంది..ఆర్ఆర్ఆర్ సినిమా అంటేనే బాహుబలి మూవీని గుర్తుకుచేసే ఓ భారీ బడ్జెట్ ఎపిక్ ప్రాజెక్ట్ అని అందరికి తెలుసు.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ మరియు ఆలియా భట్‌తో పాటు మరెంతో మంది సినీ ప్రముఖులను సింగిల్ ఫ్రేమ్‌పై చూపించే మల్టీస్టారర్ మూవీ ఇదని తెలుస్తుంది.ప్రపంచ రికార్డ్స్ తిరగ రాయాలని ఎన్టీఆర్ మరియు రాంచరణ్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. మరి ఆర్. ఆర్. ఆర్. ఆ అంచనాలను అందుకొని మరొక ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: