నటసింహ నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అది ఒక సంచలనమే. వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' కోసం బాలయ్య 'అన్ స్టాప్ అబుల్' అనే టాక్ షోను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఆడియన్స్ ని అది ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా షో పై ఆసక్తిని పెంచింది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ టాక్ షో కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలై సోషల్ మీడియా ని షేక్ చేసేసింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ సందడి చేయడం జరిగింది. ఇక ఇక ప్రోమోలో బాలయ్య తనదైన మార్క్ డైలాగ్స్ చెబుతూ ఉండగా అంతలోనే మోహన్ బాబు షో లో ఎంట్రీ ఇచ్చారు. దీంతో బాలకృష్ణ "చాదస్తం.. ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చేస్తారు" అని అన్నారు. ఇక అనంతరం మోహన్ బాబుని బాలయ్య పలు ప్రశ్నలు అడిగారు ఆ తర్వాత మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా షోలో ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచు లక్ష్మి తో బాలయ్య అదిరిపోయే డాన్స్ కూడా వేశారు. సుమారు 3 నిమిషాలకు పైగా ఈ ప్రోమో ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో భారీ వ్యూస్ తో దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

విడుదలైన కేవలం రెండు గంటల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. ఓ టాక్ షో కి సంబంధించిన ప్రోమో ఈ రేంజ్ రెస్పాన్స్ ని అందుకోవడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. అది కూడా బాలయ్య కే సాధ్యమైంది. నందమూరి అభిమానులతో పాటు సాధారణ నెటిజన్స్ ని కూడా ఈ ప్రోమో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించాడు. హోస్టింగ్ కూడా ఇరగదీశాడు. ఏమాత్రం తడబడకుండా తనదైన స్టైల్లో మంచు ఫ్యామిలీ మెంబర్స్ ని ఓ ఆట ఆడేసుకున్నాడనే చెప్పాలి. దీంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ప్రోమోనే ఇలా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో మరి?ఇక అది చూడాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: