కొంతమంది హీరోయిన్లను ఎంతో కష్టపడితేగానీ స్టార్ డం రాదు. అలాగే మరికొంత మందికి జీవితాంతం కష్టపడినా ఫలితం ఉండదు. కానీ కొంతమందిని మాత్రం ఇండస్ట్రీలో అడుగు పెట్టీపెట్టగానే అదృష్టం వరిస్తుంది. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అవ్వడమే కాకుండా వరుసగా సినిమాల ఆఫర్లు వస్తూ ఉంటాయి. దీంతో వారు మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్లుగా స్టేటస్ అందుకుని, వరుస అవకాశాలు పట్టేస్తుంటారు, అలా ఒక్కసారే టాప్ లోకి వెళ్ళిపోయిన 5 గురు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

షాలిని పాండే
షాలిని పాండే "అర్జున్ రెడ్డి" సినిమాలో తన అమాయకమైన మొహంతో కన్పించి అందరినీ మాయ చేసేసింది. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ షాలిని లాంటి లవర్ తమకూ ఉంటే బాగుండునని కోరుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా తరువాత మళ్ళీ అంతటి హిట్ షాలిని ఖాతాలో పడలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఛాన్స్ పట్టేసింది. షాలిని బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఆమె తెలుగు సినిమాల్లో కన్పించి చాలా కాలం అవుతోంది.

కృతి శెట్టి
కృతి శెట్టి ఉప్పెన సినిమాతో నిజంగానే టాలీవుడ్ లో ఉప్పెన సృష్టించింది. ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ గ్లామర్ కు, ఆ సొట్ట బుగ్గలను, లేత సొగసులు యూత్ మొత్తం ఫిదా అయిపొయింది. ఈ సినిమా విడుదల సమయంలో ఎక్కడ చూసినా కృతి శెట్టి పేరే విన్పించింది. సోషల్ మీడియాలో అయితే క్షణ క్షణానికి ఓ ఫోటో, వీడియోతో ఆమె అభిమానులు హల్చల్ చేశారు. ప్రస్తుతం బేబమ్మ ఫుల్ ఫామ్ లో ఉంది.  

రష్మిక
రష్మిక సైతం మొదటి సినిమాతోనే చూసి చూడంగానే నచ్చేసింది. అడిగి అడగకుండావే ప్రేక్షకుల మనసులలోకి చొచ్చుకుపోయింది. కన్నడ క్రష్ గా విశేషమైన అభిమానాన్ని మూటగట్టుకుంది. ఈ బ్యూటీని అంతకు ముందే కన్నడ సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా విజయ వరించలేదు. కానీ టాలీవుడ్ మాత్రం ఆమెను నెత్తిన పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా బాలీవుడ్ పై కన్నేసింది.  

పాయల్ రాజ్ పుత్
"ఆర్ఎక్స్ 100"లో పాయల్ రాజ్ పుత్ రొమాన్స్ చూసి పిచ్చెక్కిపోయారు జనం. అయితే ఆమె ఇప్పటికి అందాల ఆరబోత, వెండితెరపై రొమాన్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. కానీ ఆమె ఆ తరువాత విజయాలు పెద్దగా పలకరించలేదు.  

లావణ్య త్రిపాఠి
"అందాల రాక్షసి"గా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా నిలిచింది. అయితే అందం, అభినయం ఉన్నప్పటికి ఆమెను విజయాలు పెద్దగా పలకరించలేదు. ఇప్పటికి లావణ్యకు స్టార్ స్టేటస్ దక్కలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: