కాగా, నానికి గత కొంత కాలంగా సరైన హిట్ పడకపోయినా.. సినిమాల్లో ఆయన చేసిన నటనకు మాంచి మార్కులే పడుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన చిత్రం "శ్యామ్ సింగరాయ్". కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 24 వ తేదీన క్రిస్మస్ కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టి. సాయి పల్లవి నటించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక తన సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న నాని..యాంకర్ సుమ కోసం ఆమె నటిస్తున్న సినిమాకి హెల్ప్ చేస్తున్నాడు.
యాంకర్‌గా బుల్లితెర పై సత్తా చాటిన సుమ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘జయమ్మ పంచాయితీ’ అనే మూవీ ద్వారా సుమ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ సినిమాకి విజయ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటి అంటే.. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించడం. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేసారు నేచురల్ స్టార్ నాని. ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది.ఈ పాటకు రామాంజనేయులు అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను ఆలపించింది పీవీఎన్ఎస్ రోహిత్. అలాగే ఎంఎం కీరవాణి గారు ఎప్పటిలాగే ఈ సినిమాకు అద్భుతమైన బాణీని అందించాడు.