అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమ కథా చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు. నాగచైతన్య హీరోగా కెరీర్ ప్రారంభం చేసిన అప్పటి నుండి తను  తీసిన సినిమాలు అన్నీ కూడా లవ్ స్టోరీస్ ని బేస్ చేసుకుని తీయడం విశేషం. నాగచైతన్య మరియు సమంత వివాహం తర్వాత వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం మజిలీ. ఈ సినిమాను 2019లో నాగచైతన్య మరియు సమంత కాంబినేషన్ లో ప్రేమ మరియు స్పోర్ట్స్ మధ్య కొనసాగుతున్న ఒక విభిన్న కథగా దర్శకుడు శివ నిర్వాణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది. మరియు సుశీల్ చౌదరి నిర్మాతలు గా గా తెరకెక్కిన చిత్రం మజిలీ. సమంత నాగచైతన్య కలిసి జంటగా ఏం మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాల్లో చేశారు. కానీ పెళ్లి తర్వాత వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమిది.


ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక కుర్రవాడు ఎలాగైనా రైల్వే క్రికెట్ జట్టు లో స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో తనకు ఎదురయ్యే పరిస్థితులు వాటివల్ల తను  ఏం చేశాడు అనే విషయాలను దర్శకుడు శివ నిర్వాణ ఎంతో అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో జంటగా నటించిన సమంత , నాగ చైతన్య రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా కపుల్స్ గా కనిపించి అందరినీ మెప్పించారు. ఈ సినిమా వారిద్దరి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


ఈ సినిమాను హిందీలో డబ్ చేయడం. ఈ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో విడుదలైన ఇంత తక్కువ సమయంలో నే 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తూ ప్రస్తుతం ట్రెండింగ్లో మొదటి స్థానంలో ఉంది. ఒక తెలుగు సినిమా హిందీ వర్షన్ ఇంత పాపులర్ కావడ విశేషం అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: