అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల ఫస్ట్ లుక్ లు ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయ్యాయి. తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి ఆయన చేస్తున్న బంగార్రాజు సినిమాతో పాటు ఆయన సోలో హీరోగా చేస్తున్న థాంక్యూ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు విడుదల కాగా ఈ రెండు లుక్ లతో నాగచైతన్య ఏ రేంజ్ లో సినిమాలు చేయబోతున్నాడో వీటితో చెప్పకనే చెప్పాడు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి హీరోలుగా నటిస్తున్న సినిమాలో పక్కా మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ అని తెలుస్తుంది. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమాలో క్లాస్ పాత్ర లో నటించబోతున్నాడు చైతు. దాంతో రెండు వెరైటీ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.

ఇక ఇటీవల లవ్ స్టోరీ చిత్రం తో సక్సెస్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు మరో రెండు చిత్రాల ద్వారా కూడా సక్సెస్ కొట్టే హీరోల జాబితాలో చేరబోతున్నాడు అని అంటున్నారు. లవ్ స్టోరీ చిత్రం అక్కినేని నాగచైతన్య విషయంలో ఉన్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసింది అని చెప్పవచ్చు. నటుడిగా తనకు ప్రేక్షకులకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం లవ్ స్టోరీ. అలాంటి సినిమా లు ఆయన కెరీర్లో చాలా తక్కువగా ఉన్నాయి. లవ్ స్టొరీ చిత్రం నాగచైతన్య ను నటుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కూడా ఆయన లోని వివిధ రకాల నటనను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉంటుందని ఫస్ట్ లుక్ ను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆయా సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: