దర్శకుడు అద్వైత్ చందన్, నిర్మాతగా అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి కలిసి తెరకెక్కించబోతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్లో అక్కినేని నాగచైతన్య నటించబోతున్నరూ. ఈ సినిమాలో అమీర్ ఖాన్ గారు ఒక ఆర్మీ పాత్రలో నటించబోతున్నారు. అమీర్ ఖాన్ గారు ఆర్మీలో ఉన్నప్పుడు తన స్నేహితుడి పాత్రలో అక్కినేని నాగచైతన్య నటించబోతున్నారు. అంటే నాగచైతన్య గారిది కూడా ఆర్మీ ఆర్మీ పాత్రలో నటించబోతున్నారు. ఈ పాత్రలో నాగచైతన్యకు కాళ్లు ఉండవని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.
నాగ చైతన్య గారు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని కూడా తెలిసింది. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో హీరో అమీర్ ఖాన్ గా తో పాటు నాగ చైతన్య ఇంకా కొంతమంది ముఖ్య నటులు పాల్గొన్నారట. ఈ షూటింగ్ లో భాగంగా కొన్ని యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించ్చారు అని బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాక్. దాదాపు నెల రోజుల పాటు నాగచైతన్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ డిజైన్ చేస్తున్నారట. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రమైన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా నిర్మిస్తున్నారు.