'ఆర్.ఎక్స్.100' సినిమాతో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయాడు కార్తికేయ, ఇంకా హీరోగా పూర్తిగా సెటిల్ కాలేదు. అయితే  ఇలాంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ పెంచుకునేందుకు నెగటివ్ షేడ్స్‌ చూపిస్తున్నాడు. తమిళ్‌లో అజిత్ 'వాలిమై' సినిమాలో విలన్‌గా నటించాడు కార్తికేయ. ఇక ఈ హీరో ఇంతకుముందు నాని 'గ్యాంగ్ లీడర్'లో కూడా ప్రతినాయకుడిగా టించాడు.

హీరో శ్రీకాంత్‌ అప్పటి లాగా బాక్సాఫీస్‌ని సంతృప్తి పరచలేకపోతున్నాడు. సినిమా సినిమాకు ఆయన గ్రాఫ్ డౌన్ అయిపోతోంది.  దీంతో ఈ హీరో సపోర్టింగ్ రోల్స్‌ కూడా చేస్తున్నాడు. కెరీర్‌ బిగినింగ్‌లో సహాయ పాత్రలు, నెగటివ్ క్యారెక్టర్స్‌ చేసిన శ్రీకాంత్ మళ్లీ ఇప్పుడు విలన్‌గా బిజీ అవుతున్నాడు. బాలకృష్ణ 'అఖండ' సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు శ్రీకాంత్. అలాగే రామ్‌ చరణ్‌, శంకర్ సినిమాలో కూడా నెగటివ్‌ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇక విజయ్ సేతుపతికి కోలీవుడ్ లో సూపర్‌ క్రేజ్ ఉంది. మక్కల్‌ సెల్వన్‌గా నేషనల్ అవార్డ్‌ కూడా అందుకున్నాడు. అయితే ఎప్పుడూ ప్రయోగాలకి సిద్ధంగా ఉండే సేతుపతి విలన్‌ రోల్స్‌ని కూడా అంతే ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాడు. 'ఉప్పెన'లో విలన్‌గా సర్‌ప్రైజ్‌ చేసిన సేతుపతి, 'మాస్టర్'లో కూడా విలనిజం చూపించాడు. ఇప్పుడు హిందీలో షాహిద్‌ కపూర్ వెబ్‌ సీరీస్‌లో నెగటివ్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు.

సైఫ్ అలీ ఖాన్‌ మార్కెట్‌కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటున్నాడు. హీరోగా కొంచెం స్లో అవ్వగానే సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యాడు. విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. ఇప్పటికే అజయ్ దేవగణ్ 'తానాజీ'లో విలన్‌గా చేశాడు సైఫ్‌. ఉదయభాను సింగ్ పాత్రతో క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఈ ఇదిలోనే ప్రభాస్‌ 'ఆదిపురుష్'లో రావణాసురుడిగా నటిస్తున్నాడు సైఫ్. బాలీవుడ్‌లో ఖాన్స్‌కి టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. స్టైలిష్‌ లుక్‌తో బోల్డంత ఫీమేల్ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఈ హీరో విలన్‌గా మారుతున్నాడు. నితీష్ తివారి దర్శకత్వంలో వాల్మీకి రామాయణం ఆధారంగా ఒక సినిమా వస్తోంది. ఈ కథలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా నటిస్తే, హృతిక్‌ రావణాసురుడి నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: