టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా తో థియేటర్ లోకి వచ్చిన నాగ చైతన్యసినిమా తో బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను తాజా గా థాంక్యూ చిత్ర బృందం విడుదల చేసింది. 

నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భం గా థాంక్యూ చిత్ర బంధం నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం బయటకు వదిలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది లా ఉంటే నాగ చైతన్యసినిమా తో పాటు నాగార్జున హీరో గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో నాగ చైతన్య సరసన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా తో పాటు  నాగ చైతన్య అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: