అనీల్ రావిపూడి మాట్లాడుతూ... f3 చిత్రంలో పాన్ ఇండియా సర్పైజ్ క్లైమాక్స్ లో ఉందని ఇప్పుడు ఏమీ చెప్పను కానీ థియోటర్ లో ఆ పోర్షన్స్ చూసినప్పుడు జనం బాగా ఎంజాయ్ చేస్తారని ఇక నేను ప్యాన్ ఇండియా సినిమాని భవిష్యత్ లో ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పాడట.అయితే నేను ఎంచుకున్న కథలో ఆ పొటిన్షిల్ ఉండాలని తెలుగులో సినిమాలు తెరకెక్కించటంలో నాకు చాలా కంఫర్ట్ ఉందని ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్ 3 సినిమాలో ఫన్ అండ్ గ్లామర్ డోస్ పెంచిన అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కోసం తమన్నా, మెహరీన్ కు తోడుగా సోనాల్ చౌహన్ ను కూడా తీసుకున్నారట.
అలాగే ఈ సినిమాలో వెంకటేష్ కు రేచీకటి మరియు వరుణ్ తేజ్ కు నత్తి ఉంటాయట. అయితే అవి కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయవని అలాగే అవి కొన్ని సీన్స్ లో మాత్రమే వాడటం జరిగిందట ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్ 80% పూర్తైందని. టాకీ పార్ట్ కొంత మరియు పాటలు బాలెన్స్ ఉన్నాయట డిసెంబర్ కు మొత్తం టాకీ పూర్తవుతుందని తెలుస్తుంది.
ఇక ఎఫ్ 2 కథ భార్యా,భర్తల మధ్య జరుగుతుందని అయితే ఎఫ్ 3 చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుందని సునీల్, మురళి శర్మ ఈ సినిమా కొత్తగా కలుస్తారట.. సరిలేరు నీకెవ్వరు వంటి సీరియస్ సబ్జెక్టు తర్వాత నేను చేస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ఇదని ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవుతాము అన్నారట."దృశ్యం 2" ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్ ఈ సినిమా విడుదల గురించి స్పందించారట.. వెంకీ 'ఎఫ్ 3' సంక్రాంతికి విడుదల కాబోదని క్లారిటీ ఇచ్చేశాడట.. 'ఎఫ్ 3' వేసవిలో విడుదలవుతుందని అలాగే ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని వెంకీ మామ చెప్పాడట.