‘బాహుబలి’ ఘన విజయం తరువాత రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. తెలుగు దర్శకులలో ప్రపంచ స్థాయి గుర్తు తెచ్చుకున్న స్థాయికి రాజమౌళి తప్ప మరెవ్వరు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరు. దీనితో రాజమౌళి మించి సినిమా వస్తుంది అంటే ఆకాశంలో అంచనాలు ఉంటాయి.


జనవరిలో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ ఇప్పుడు అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈమూవీ ‘బాహుబలి’ స్థాయిని మించి ఘన విజయం సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రాజమౌళి కూడ ఈ మూవీ గురించి మరింత అంచనాలు పెంచుతున్నారు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఎన్నో సినిమాల పోటీ ఉన్నప్పటికీ దానిని పట్టించుకోను అంటూ కామెంట్స్ చేసాడు.


ఇలా కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే రాజమౌళి పరోక్షంగా సంక్రాంతి రేస్ కు రాబోతున్న కొన్ని సినిమాల వాయిదా కోసం వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేయడం చూసినవారు పోటీ అంటే భయపడని రాజమౌళి ఇప్పుడు పోటీ గురించి ఖంగారు పడుతున్నాడా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం రాజమౌళి స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో ‘గంగూభాయ్ కతియావాడి’ నిర్మాతలు తమ సినిమాను జనవరి 6న విడుదల తేదీ నుండి తప్పించారు.


ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీని సంక్రాంతి రేసు నుండి తప్పించాలని రాజమౌళి దిల్ రాజ్ ద్వారా చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలం కాకపోవడంతో ఇప్పుడు స్వయంగా జక్కన్న రంగంలోకి దిగి ఈ విషయమై పవన్ ను రిక్వెస్ట్ చేయాలని పవర్ స్టార్ తో అపాయింట్ మెంట్ అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా రాజమౌళి లాంటి టాప్ దర్శకుడు కూడ పోటీ అంటే ఖంగారు పడుతున్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: