సాధారణంగా దర్శకులు ఏ కథనైనా తెరకెక్కిస్తున్నారు అంటే కచ్చితంగా అది ఎక్కడైనా జరిగిన యదార్థ సంఘటన అయినా అయి ఉండాలి లేదా సమాజంలో కొంతమంది వ్యక్తుల జీవిత కథను ఆధారంగా తీసుకొని అయినా తెరకెక్కిస్తూ వుంటారు. అందుకే దర్శకులు ఏ కథను తెరకెక్కించిన కచ్చితంగా ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ ను అయితే ఇస్తూ ఉండడం గమనార్హం. అలాంటి సినిమాలలో యధార్థ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్. సమాజంలో లంచగొండితనం ఎక్కువ అవుతున్న తరుణంలో రాజకీయ నాయకులు సామాన్య ప్రజలను లంచం పేరిట ఎంతలా వాడుకుంటున్నారో ఈ చిత్రంలో చక్కగా చూపించారు.


ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 2002లో తమిళ చిత్రంగా తెరకెక్కిన రమణకు అనే సినిమాకు రీమేక్. 2003లో విడుదలైన భారతీయ తెలుగు భాష యాక్షన్ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాతో పాటు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ లో ఠాగూర్ చిత్రం కూడా ప్రదర్శించబడింది. దేశంలో ఎక్కడ చూసినా లంచగొండి తనం వినిపిస్తోంది. అసలు లంచం లేనిది ఏ పని కూడా జరగడం లేదు. సామాన్య ప్రజలను లంచం పేరిట మరింతగా దోచుకొని వారిని దరిద్రులుగా మారుస్తున్నారు. శ్రీయ, జ్యోతిక , సునీల్ , చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు.


ఇక ఉన్నత అధికారులు మాత్రం డబ్బుతో ఉన్నతంగానే బ్రతుకుతున్నారు.. ఇలాంటి సమాజంలో లంచం అనే పేరు లేకుండా ప్రతి ఒక్కరిని అంతమొందిస్తూ  లంచం అనే పదాన్ని కూడా నిర్మూలించేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యాంటీ కరప్షన్ ఫోర్స్ అనే పేరుతో ఎవరైతే లంచం తీసుకుంటారో వారిని హతమార్చారు. అంతేకాదు లంచం అనే పేరు వింటేనే రాజకీయ నాయకులు కూడా ఉలిక్కిపడేలా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి సమాజంలో లంచం తీసుకునే వారికి ఈ సినిమా ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: