సాధారణంగా డిసెంబర్ నెల టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాల డల్ గా నడుస్తుంది. క్రిస్మస్ సమయంలో ఒక మీడియం రేంజ్ సినిమాతో సరిపెడితే ఇక భారీ సినిమాల హడావిడి అంత జనవరి నుండి ప్రారంభం అయ్యేది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమాల జాతర డిసెంబర్ మొదటివారం నుండి ప్రారంభం కావడంతో 'అఖండ’ నుండి ‘రాథే శ్యామ్’ వరకు విడుదల కాబోతున్న సుమారు 10 పైగా సినిమాలలో ఎన్ని హిట్ అవుతాయి అన్నఅంచనాలు ఎవరికీ అందడం లేదు.


సాధారణంగా టాప్ హీరోల సినిమాలు డిసెంబర్ లో విడుదల కావు. కానీ ఈసారి దీనికి భిన్నంగా డిసెంబర్ లో ‘అఖండ’ ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘గని’ సినిమాలు రాబోతున్నాయి. ఈ నాలుగు సినిమాల పైనా అంచనాలు బాగా ఉండటంతో ఈ నాలుగు సినిమాలకు బిజినెస్ బాగా అయింది. ఇదే నెలలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మూవీతో పాటు భారీ అంచనాలు ఉన్న ‘స్పైడర్’ సిరీస్ లోని భారీ గ్రాఫిక్స్ మూవీ కూడ రాబోతోంది.


దీనితో డిసెంబర్ లో ఇన్ని సినిమాలను ఇప్పుడు పరిస్థితులలో సగటు ప్రేక్షకుడు ఫ్యామిలీలతో వస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇదే నెలలో క్రిస్మస్ ఆతరువాత జనవరి 1 రాబోతున్న పరిస్థితులలో ఖర్చులతో సతమతమయ్యే సగటు జీవి ఎన్ని సినిమాలు చూడగలడు అన్నది సమాధానం లేని ప్రశ్న. ఈ డిసెంబర్ సినిమాల జాతర సంక్రాంతి సీజన్ లో కొనసాగుతూ అత్యంత భారీ సినిమాలకు రంగం సిద్ధం అయింది.


సంక్రాంతికి రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ లపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీల లిస్టు చూస్తే సినిమాలు అంటే ఇష్టపడే సగటు వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇన్ని సినిమాలు సగటు ప్రేక్షకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి చూడాలి అంటే ఎన్ని వేలు కావాలి అంటూ వరసపెట్టి క్యూ కడుతున్న ఈ భారీ సినిమాల జాతరలో చాల కొద్ది సినిమాలు మాత్రమే గట్టు ఎక్కే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: